మంత్రిపై చేయిచేసుకున్న మరో మంత్రి | Rajasthan Minister Slaps Another Over Transfer of Teachers | Sakshi
Sakshi News home page

మంత్రిపై చేయిచేసుకున్న మరో మంత్రి

Jun 30 2018 2:53 PM | Updated on Jun 30 2018 5:19 PM

Rajasthan Minister Slaps Another Over Transfer of Teachers - Sakshi

ఉపాధ్యాయుల బదిలీల అంశంపై ఇద్దరు మంత్రుల మధ్య తలెత్తిన వివాదం ఒకరిపై ఒకరు చేయిచేసుకునే వరకు వెళ్లింది.

జైపూర్ : ఉపాధ్యాయుల బదిలీల అంశంపై ఇద్దరు మంత్రుల మధ్య తలెత్తిన వివాదం ఒకరిపై ఒకరు చేయిచేసుకునే వరకు వెళ్లింది. రాజస్థాన్‌లో చోటు చేసుకున్న ఈ సంఘటన సంచలనంగా మారింది. వివరాల్లోకి వెళితే.. శిఖర్ జిల్లా ఖండేలా నియోజకవర్గంలో ప్రభుత్వ ఉపాధ్యాయుల బదిలీలు పారదర్శకంగా జరగడం లేదనే ఆరోపణలు రావడంతో ఆ నియోజకవర్గ ఎమ్మెల్యే, రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి బన్షీధర్ బజియా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ విషయంపై విద్యాశాఖ మంత్రి వసుదేవ్‌ దేవ్నానీతో చర్చించేందుకు శుక్రవారం బన్షీధర్ బజియా ఆయన ఇంటికి వెళ్లారు.

ఈ క్రమంలో అక్కడ ఇద్దరు మంత్రుల మధ్య వాగ్వాదం జరిగింది. దీంతో ఆగ్రహానికి గురైన బజియా మంత్రి దేవ్నానీపై చేయిచేసుకున్నట్లు స్థానిక మీడియా వెల్లడించింది. ఈ ఘటనపై స్పందింయేందుకు దేవ్నానీ నిరాకరించగా, బజియా మొబైల్‌ను స్విచ్చాఫ్ చేసినట్టు సమాచారం. మరో వైపు ఈ ఘటనపై బీజేపీ మీడియా విభాగం ఇంఛార్జి అనంద్ శర్మ మాట్లాడుతూ ఉపాధ్యాయుల బదిలీ విషయంలో ఇరు మంత్రుల మధ్య తీవ్ర వాగ్వాదం జరిగినట్టు ధ్రువీకరించారు. అంతే కాకుండా ఈ ఘటన సంచలనంగా మారడంతో రాజస్థాన్ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు అవినాశ్‌ రాయ్‌ ఇద్దరు మంత్రులను పిలిపించి మాట్లాడినట్టు తెలుస్తోంది. తాజా అంశంపై వసుంధర రాజే ప్రభుత్వంపై కాంగ్రెస్‌ విమర్శలు సంధిస్తోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement