‘ఓయ్‌ పిల్లాడా ! ప్రియా వారియర్‌ కంటే..’ | Rahul Gandhi hugs PM Modi after speech | Sakshi
Sakshi News home page

కౌగిలింత.. ఆపై కన్నుగీత!

Jul 21 2018 3:06 AM | Updated on Mar 9 2019 3:59 PM

Rahul Gandhi hugs PM Modi after speech - Sakshi

ప్రియా వారియర్‌ (ఫైల్‌), లోక్‌సభలో మోదీ, రాహుల్‌ మాటామంతీ

రాహుల్‌ కన్నుగీటడంపై స్వయంగా ప్రియా వారియర్‌  ‘ఈ విధంగా కన్నుగీటడం తియ్యటి సంజ్ఞ, చేష్ట. ఇది నాకు సంతోషాన్ని కలిగించింది’ అంటూ స్పందించింది.
 

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌తో సహా వివిధ దేశాధినేతలను ప్రధాని నరేంద్ర మోదీ తనదైన శైలి ఆలింగనంతో (బేర్‌ హగ్‌) చిత్తు చేస్తే, ఆయనకు విపక్ష కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ రూపంలో ఆలింగనంలో పోటీ ఎదురైందనే సరదా చర్చ సాగుతోంది. శుక్రవారం లోక్‌సభలో ఎన్డీఏ సర్కార్‌పై ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానంపై చర్చ సందర్భంగా రాహుల్‌ తన ప్రసంగంతో, ఆ తర్వాత మోదీని ఆప్యాయంగా కౌగిలించుకుని, ఆ వెంటనే సహచర ఎంపీలను ఉత్సాహపరుస్తూ కొంటెగా కన్నుగీటడం అందరినీ ఆశ్చర్యపరిచింది. రాహుల్‌ చేష్టలన్నింటినీ వివిధ జాతీయ టీవీ ఛానళ్లు పదేపదే చూపాయి. ఈ ఘట్టాలు ట్విట్టర్‌ సహా ఇతర సామాజిక మాధ్యమాల్లో హాస్యపూర్వక వ్యాఖ్యలు, చర్చలకు దారితీశాయి.

► ‘ఓయ్‌ పిల్లాడా ! ప్రియా ప్రకాష్‌ వారియర్‌ (కన్నుగీటిన సీన్ల ద్వారా పాపులర్‌ అయిన మలయాళీ నటి) కంటే మెరుగ్గా రాహుల్‌ కన్నుగీటారు. మున్నాభాయ్‌ కంటే బాగా ఆలింగనం చేసుకున్నారు. దీనికి ఆస్కార్‌ అవార్డ్‌ రావొచ్చేమో?’ నంటూ గౌతమ్‌ జోషి ట్వీట్‌ చేశారు.

► ‘ప్రియా వారియర్‌ కంటే కూడా నిట్టనిలువునా మనిషిని పడగొట్టేలా కన్నుకొట్టడమంటే ఇదే’నని ఆకాష్‌ సిన్హా పేర్కొన్నారు

► ఈ కౌగిలింత ప్రభావం ఎంతో తీవ్రంగా ఉండబోతోంది. ప్రియా వారియర్‌ కంటే కూడా ఈ కన్నుగీటడం మరింత ఎక్కువగా అంటురోగంగా వ్యాపిస్తుందేమోనన్న సందేహాన్ని గీతాశర్మ వెలిబుచ్చారు.

► అయితే రాహుల్‌ కన్నుగీటడంపై స్వయంగా ప్రియా వారియర్‌  ‘ఈ విధంగా కన్నుగీటడం తియ్యటి సంజ్ఞ, చేష్ట. ఇది నాకు సంతోషాన్ని కలిగించింది’ అంటూ స్పందించింది.

► అవిశ్వాసంపై చర్చను పక్కన పెట్టి మోదీపై దాడే రాహుల్‌ ఏకైక లక్ష్యంగా కనిపిస్తోంది. ప్రసంగం బదులు ప్రదర్శన ఇచ్చారు. చిన్నపిల్లాడి మాదిరిగా అందరినీ ఆకర్షించే ప్రయత్నం చేయడం తప్ప ఓ విజనూ
లేదూ, రోడ్డు మ్యాపూ లేదు’ అంటూ మరో ట్విటరాటీ సంజూ శర్మ విరుచుకుపడ్డారు

► ప్రధానిని రాహుల్‌గాంధీ ఆలింగనం చేసుకోవడం, ఆ తర్వాత చౌకబారుగా కన్నుగీటడం ఆయన అపరిపక్వతను, స్థాయి లేమి తనాన్ని స్పష్టం చేస్తోంది’ అంటూ ఘోస్‌ స్పాట్‌ అకౌంట్‌ ట్వీట్‌ చేశారు.

► ముఖ్యమైన అవిశ్వాసంపై చర్చ సందర్భంగా పార్లమెంట్‌ మర్యాదను, నిబంధనలను రాహుల్‌ తక్కువచేశారు. జప్పీ (కౌగిలింత) తర్వాత కన్నుగీటడం చూస్తుంటే ఆయన ప్రతిపక్ష నేతా లేక మున్నాభాయ్‌ ఎంబీబీఎస్‌ వంటి పాత్రా? సిగ్గుచేటు...షెహజాద్‌ జై హింద్‌ ట్విటర్‌ అకౌంట్‌ నుంచి పేర్కొన్నారు

► ఆలింగనం తర్వాత కన్నుకొట్టడమా? భారతీయులను మూర్ఖులను చేయాలనే యత్నం వద్దు రాహుల్‌. పార్ల మెంట్‌లో కామెడీ షో ఏం జరగడం లేదు. పార్లమెంట్‌లో వాస్తవాలు మాట్లాడేటపుడు సీరియస్‌గా వ్యవహరించు. ప్లీజ్‌ పరిణతి ప్రదర్శించు...బర్ఖా ట్రెహాన్‌ ట్వీట్‌ చేశారు.

► ‘వావ్‌..వావ్‌ ! ఏమి హగ్‌ అండీ. ఎంత అద్భుతమైన రోజు ఇది’ అని సంజుక్త బసు వ్యాఖ్యానించారు.

► ‘న్యూ వైల్డ్‌ స్టోన్‌ యాడ్‌ మాదిరిగా ఉంది ఇది’ అని ఓజాస్‌ ట్వీటారు.

► రాహుల్‌ తన ప్రసంగంలో బీజేపీ వైఫల్యాలు ఎండగట్టి, ఆ తర్వాత ఆలింగనం చేసుకోవడం ద్వారా మోదీ, బీజేపీ కంటే తాను, కాంగ్రెస్‌పార్టీ ఏ విధంగా భిన్నమైందో చెప్పారు అని శ్రీవత్స పేర్కొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement