రాహుల్‌ ట్విటర్‌ పేరు మారింది

Rahul Gandhi Changes His Twitter Handle - Sakshi

న్యూఢిల్లీ : కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ ఎట్టకేలకు తన ట్విటర్‌ అకౌంట్‌ పేరు మార్చేశారు. సోషల్‌ మీడియా నుంచి భారీ ఎత్తున్న విమర్శలు వెల్లువెత్తిన తర్వాత రాహుల్‌ ఇక చివరికి ఈ నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటి వరకు ‘ఆఫీస్‌ఆప్‌ఆర్‌జీ’గా ఉన్న తన ట్విటర్‌ పేరును, ఇక నుంచి సాదాసీదాగా ‘రాహుల్‌గాంధీ’ అని పెట్టుకున్నారు. అంతకముందు ఉన్న ‘ఆఫీస్‌ఆప్‌ఆర్‌జీ’  పేరుపై సోషల్‌ మీడియా యూజర్లు విమర్శలు కురిపించిన సంగతి తెలిసిందే. ‘ఆఫీస్‌ఆప్‌ఆర్‌జీ’  అంటే రాహుల్ గాంధీ కార్యాలయం అని అర్థం. గొప్ప కోసం లేదా వెర్రితనంగా అభివర్ణిస్తూ సోషల్‌ మీడియాలో కామెంట్లు పెట్టేవారు. 

ఈ విమర్శలకు సమాధానంగా తన ట్విట్టర్ ఖాతాలో తన పెంపుడు కుక్క ట్వీట్లు పెడుతుందంటూ ఆయన జోకులు కూడా పేల్చారు. గత నవంబర్‌లో కాంగ్రెస్‌ పార్టీ ఐటీ సెల్‌ మెంబర్లతో సమావేశమైన రాహుల్‌, తన సోషల్‌ మీడియా వ్యూహంపై చర్చించారు. కొన్ని అంశాలపై తాను ఎక్కువగా ఫోకస్‌ చేశానని, వాటిని మైక్రోబ్లాగింగ్‌సైట్‌లో పోస్టు చేసే ముందు వాటికి సూచనలను కూడా తన కమ్యూనికేషన్‌ టీమ్‌కు ఇస్తున్నట్టు తెలిపారు.  తన ట్విటర్‌ అకౌంట్‌లో ఎక్కువగా రాజకీయాలపైనే ఫోకస్‌ చేసినట్టు చెప్పారు. బర్త్‌డే శుభాకాంక్షలు వంటి సాధారణమైన వాటికి ట్విటర్‌ వాడనని పేర్కొన్నారు. కేవలం తన ఆలోచనలన్నీ రాజకీయ ట్వీట్లపైనే అన్నారు. 
 

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top