నేను ఇందిరా గాంధీ మనువరాలిని.. | Priyanka Gandhi: UP Govt Take Any Action On Me But I Will Keep Highlighting The Truthpolip | Sakshi
Sakshi News home page

‘నేను ఇందిరా మనువరాలిని.. ఖచ్చితంగా చేసి తీరుతా’

Jun 26 2020 11:57 AM | Updated on Jun 26 2020 12:12 PM

Priyanka Gandhi: UP Govt Take Any Action On Me But I Will Keep Highlighting The Truthpolip - Sakshi

లక్నో : ఉత్తర ప్రదేశ్‌ ప్రభుత్వం తనకు  వ్యతిరేకంగా ఎన్ని చర్యలు తీసుకున్నా జరుగుతున్న​ వాస్తవాలను ధైర్యంగా ప్రజల ముందు ఉంచుతానని కాంగ్రెస్‌ నాయకురాలు ప్రియాంక గాంధీ స్పష్టం చేశారు. ఈ  మేరకు శుక్రవారం ట్వీటర్‌ వేదికగా రాష్ట్ర ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. ‘ఉత్తర ప్రదేశ్‌ ప్రజల బాధ్యత ప్రజా సేవకురాలిగా నా కర్తవ్యం. వాస్తవాలను వారి ముందు ఉంచడం నా విధి. ప్రభుత్వం గురించి ప్రచారం చేయడం నా పనికాదు. నన్ను బెదిరించే ప్రయత్నంలో ఉత్తర ప్రదేశ్‌ ప్రభుత్వం సమయం వృథా చేస్తోంది. నాపై ఎన్ని చర్యలు తీసుకున్నా నేను నిజాలను ప్రచారం చేస్తూనే ఉంటాను. నేను కొంతమంది నాయకుల మాదిరి బీజేపీ చెప్పుకోలేని ప్రతినిధిని కాదు. ఇందిరాగాంధీ మనవరాలిని’ అంటూ ట్వీట్‌ చేశారు. (ప్రియాంకాకు కొత్తపేరు పెట్టిన బీజేపీ నేత)

రాష్ట్రంలో కరోనా వైరస్‌ వ్యాప్తితోపాటు పలు అంశాలపై యోగి ప్రభుత్వంపై ప్రియాంక ధ్వజమెత్తారు. కాన్పూర్‌లోని ప్రభుత్వ శిశు ఆశ్రయ గృహంలో 57 మంది బాలికలు కరోనా పాజిటివ్‌గా తేలిందని ఆదివారం ప్రియాంక ఫేస్‌బుక్ పోస్ట్‌లో పేర్కొన్నారు, వీరిలో ఇద్దరు బాలికలు గర్భవతులు కాగా, ఒకరు హెచ్‌ఐవి పాజిటివ్‌ ఉన్నట్లు ఆమె తెలిపారు. అయితే రాష్ట్ర బాలల హక్కుల మండలి గురువారం ప్రియాంకు నోటీసులు జారీ చేసింది. ఆశ్రమ గృహంపై తప్పుదోవ పట్టించే విధంగా వ్యాఖ్యలు చేశారని, దీనికి మూడు రోజుల్లోగా సమాధానం ఇవ్వాలని కోరింది. (కాంగ్రెస్‌ సీనియర్‌ నేతకు కరోనా పాజిటివ్‌ )

కరోనాతో ఆగ్రా ఆస్పత్రిలో చేరిన 48 గంటల్లోనే 28 మంది మరణించినట్లు ఓ వార్త క్లిప్‌ను జతచేస్తూ జూన్‌ 22న ట్వీట్‌ చేశారు. కాగా ఈ ట్వీట్‌పై స్పందించిన ఆగ్రా జిల్లా  కలెక్టర్‌ ప్రభు నరైన్ సింగ్ మంగళవారం ట్వీట్ ఉపసంహరించుకోవాలని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శిని కోరారు. అయితే దీనిని పట్టించుకోని ప్రియాంక ఆగ్రాలో కోవిడ్ -19 మరణాల రేటు 6.8 శాతంగా ఉందని, ఇది ఢిల్లీ, ముంబై కంటే ఎక్కువగా ఉందని పేర్కొన్నారు. దీనిపై ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ వివరణ ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. (28 కోవిడ్ మ‌ర‌ణాలు.. విచార‌ణ‌కు సీఎం ఆదేశం)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement