ఒకటి ఓకే.. రెండు, మూడు అయితే కరెంట్‌ షాకే | Press Only First Button If You Press Second Third Button Will Get Electric SHock Chhattisgarh Minister Says | Sakshi
Sakshi News home page

’ఈవీఎంలపై ఫస్ట్‌ బటన్‌ మాత్రమే నొక్కండి..రెండు, మూడు నొక్కితే కరెంట్‌ షాకే’

Apr 17 2019 4:23 PM | Updated on Jul 11 2019 8:26 PM

Press Only First Button If You Press Second Third Button Will Get Electric SHock Chhattisgarh Minister Says - Sakshi

రాయ్‌పూర్‌ : రెండో దశ లోక్‌సభ ఎన్నికలకు ఒక్క రోజు ముందు ఛత్తీస్‌గడ్‌ కాంగ్రెస్‌ సీనియర్‌ నేత, మంత్రి కావాసి లఖ్మా వివాదస్పద వ్యాఖ్యలు చేసి ఎన్నికల సంఘంతో నోటీసులు ఇప్పించుకున్నారు. ఈవీఎంలో మొదటి బటన్‌ మాత్రమే నొక్కాలని, రెండో, మూడో బటన్‌ నొక్కితే కరెంట్‌ షాక్‌ తగులుతుందని ఓటర్లను భయబ్రాంతులకు గురి చేశారు. దీంతో వివరణ ఇవ్వాలంటూ ఎన్నికల సంఘం నోటీసులు జారీ చేసింది.

మంత్రి కావాసి లఖ్మా

 బుధవారం ఎన్నికల ర్యాలీలో పాల్గొన్న కావాసి లఖ్మా ..‘రాష్ట్ర ఓటర్లంతా ఈవీఎంలపై ఉన్న మొదటి బటన్‌ మాత్రమే నొక్కాలి( మొదటి బటన్‌ కాంగ్రెస్‌ పార్టీ గుర్తు) అలా కాదని రెండో బటనో లేదా మూడో బటనో నొక్కితే కరెంట్‌ షాక్‌ తగులుతుంది. అందరు జాగ్రత్తగా మొదటి బటన్‌ నొక్కండి’ అని ఓటర్లకు సూచించారు. కాగా కావాసి మాటలు ఓటర్లను భయబ్రాంతులకు గురి చేసేలా ఉందని, అది ఎన్నికల నియమావళిని ఉల్లంఘించడమేనని ఎన్నికల సంఘం పేర్కొంది. ఆ వ్యాఖ్యలపై వివరణ ఇవ్వాలంటూ కావాసికి నోటీసులు జారీ చేసింది. దేశ వ్యాప్తంగా రెండో దశ లోక్‌సభ ఎన్నికలు ఈ నెల 18న జరగనున్నాయి. ఛత్తీస్‌గఢ్‌లోని మూడు పార్లమెంట్‌ నియోజకవర్గాల్లో రేపు ఎన్నికలు జరుగుతాయి. ఎన్నికల ఫలితాలు మే 23న వెలువడుతాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement