‘లోకేశ్‌ అడిగితే నా సీటిచ్చేస్తా’

Prathipati Pulla Rao Offer His Seat For Nara Lokesh - Sakshi

సాక్షి, చిలకలూరిపేట టౌన్‌: మంత్రి నారా లోకేశ్‌ అడగాలేగానీ తాను ప్రాతినిధ్యం వహిస్తున్న గుంటూరు జిల్లాలోని చిలకలూరిపేట సీటు ఇచ్చేస్తానని పౌరసరఫరాల శాఖ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు అన్నారు. ఆయన శుక్రవారం విలేకరులతో మాట్లాడుతూ.. వచ్చే ఎన్నికల్లో లోకేశ్‌ ఎక్కడి నుంచి పోటీ చేసినా సీటు ఇవ్వటానికి 175 అసెంబ్లీ నియోజకవర్గాల్లోని టీడీపీ అభ్యర్థులంతా సిద్ధంగా ఉన్నారని ప్రకటించారు. ఆయనకు సీటు సమర్పించుకోవటం తమ అదృష్టంగా భావిస్తామన్నారు.

ముందస్తు ఎన్నికలకు తమ పార్టీ సిద్ధంగా లేదని, ప్రజలు ఐదేళ్లు పాలించమని అధికారమిస్తే తామెందుకు ముందస్తు ఎన్నికలకు వెళ్తామని ఆయన ఎదురు ప్రశ్నించారు. బీజేపీ ఓటమి భయంతోనే జమిలి ఎన్నికలు నిర్వహించటానికి ప్రయత్నిస్తోందంటూ ధ్వజమెత్తారు. 

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top