వ్యాపారుల్ని దొంగలన్నారు

Opposition trying to create perception against businessmen and traders - Sakshi

70 ఏళ్ల కాంగ్రెస్‌ పాలనలో వర్తకులకు అన్నీ అవమానాలే

వాణిజ్యవేత్తలతో సమావేశంలో ప్రధాని ఆరోపణలు

న్యూఢిల్లీ: వ్యాపారులందరూ దొంగలేనని కాంగ్రెస్‌ పార్టీ అంటోందనీ, గత 70 ఏళ్ల ఆ పార్టీ పాలనలో వ్యాపారులకు అన్నీ అవమానాలే ఎదురయ్యాయని ప్రధాని నరేంద్ర మోదీ ఆరోపించారు. ధరలు పెరగడానికి వర్తకులే కారణమని గతంలో కాంగ్రెస్‌ ప్రభుత్వాలు ఆరోపించేవనీ, అయితే వాస్తవానికి ఆ పార్టీ మనుషులే వస్తువులను నల్లబజారుకు తరలించి ధరలు పెరిగేలా చేసేవారని మోదీ నిందించారు. ఢిల్లీలో పలువురు వ్యాపారులతో మోదీ శుక్రవారం సమావేశమయ్యారు. అక్కడ ఆయన మాట్లాడుతూ ‘వ్యాపారులను దొంగలు అంటూ కాంగ్రెస్‌ దుర్భాషలాడుతోంది. కానీ జాతిపిత మహాత్మా గాంధీ తాను వ్యాపారుల కులమైన బనియాకు చెందిన వాడినని గర్వంగా చెప్పేవారు. భారత ఆర్థిక వ్యవస్థకు వ్యాపారులు వెన్నెముక. కానీ గతంలో వారికి లభించాల్సిన గౌరవం ఎన్నడూ దక్కలేదు. కష్టకాలంలో వ్యాపారులకు బాసటగా నిలిచింది బీజేపీ ప్రభుత్వమే’ అని అన్నారు.

తనఖా లేకుండానే 50 లక్షల రుణం
మళ్లీ ఎన్డీయే అధికారం చేపడితే వ్యాపారులకు ఎలాంటి తనఖా లేకుండానే రూ. 50 లక్షల వరకు రుణాలిస్తామనీ, జీఎస్టీ వ్యవస్థలో నమోదైన సంస్థలకు రూ. 10 లక్షల వరకు ప్రమాద బీమా సౌకర్యం కల్పిస్తామని మోదీ తెలిపారు. వ్యాపారులకు క్రెడిట్‌ కార్డు సౌకర్యం కల్పించడం, చిన్న దుకాణాలు నడుపుకునే వ్యక్తులకు పింఛన్‌ పథకాన్ని ప్రవేశపెట్టడంతోపాటు కొత్త చిల్లర వర్తక విధానాన్ని తెస్తామని మోదీ ప్రకటించారు. అలాగే జాతీయ వ్యాపారుల సంక్షేమ మండలిని ఏర్పాటు చేస్తామని హామీనిచ్చారు. సులభతర వాణిజ్య ర్యాంకుల్లో భారత్‌ తమ ప్రభుత్వ కాలంలో 65 స్థానాలు మెరుగుపరుచుకుని 77వ ర్యాంకు పొందిన విషయాన్ని మోదీ గర్తుచేశారు.

స్టార్టప్‌ల్లో 20 వేల కోట్లు పెడతాం..
తమ ఐదేళ్ల పదవీ కాలంలో పురాతన కాలం నాటి 1,500 చట్టాలను రద్దుచేసి వ్యాపారుల జీవితాలను, పనులను సరళతరం చేశామని మోదీ చెప్పారు. ‘వ్యాపారులు దోహదం చేయడం వల్లే ఆర్థిక వ్యవస్థను 5 ట్రిలియన్‌ డాలర్లకు చేర్చగలిగాం. వ్యాపారుల శ్రమ నన్ను ఆకట్టుకుంది. ఆర్థిక వ్యవస్థ వికసించడానికి వారు సాయపడ్డారు’ అని మోదీ పేర్కొన్నారు. తమ పార్టీ గెలిస్తే యువతను వ్యాపారం వైపు ఆకర్షించేందుకు రూ. 20,000 కోట్లను స్టార్టప్‌ రంగంలో పెట్టుబడులుగా పెడతామని చెప్పారు.

మరిన్ని వార్తలు

24-05-2019
May 24, 2019, 04:30 IST
సాక్షి, హైదరాబాద్‌ : భువనగిరి పార్లమెంట్‌ ఎన్నికల్లో విజయంతో కోమటిరెడ్డి బ్రదర్స్‌ మళ్లీ సత్తా చాటారు. గత ఎన్నికల్లో తన...
24-05-2019
May 24, 2019, 04:26 IST
సాక్షి, అమరావతి : లోక్‌సభ స్థానాల్లో కూడా తెలుగుదేశం పార్టీకి ఘోరమైన ఓటమి తప్పలేదు. గతంలో ఎన్నడూ లేని రీతిలో...
24-05-2019
May 24, 2019, 04:26 IST
జాతీయ ప్రజాస్వామిక కూటమికి (ఎన్‌డీఏ)కు గట్టి పోటీ ఇస్తుందనుకున్న ఉమ్మడి ప్రగతిశీల కూటమి(యూపీఏ) కనీసం యుద్ధం కూడా సరిగా చేయకుండా...
24-05-2019
May 24, 2019, 04:23 IST
సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్ర కాంగ్రెస్‌ కీలక నేతల పరువు నిలబడింది. లోక్‌సభ ఎన్నికల్లో ఆ పార్టీ తరఫున పోటీ చేసిన...
24-05-2019
May 24, 2019, 04:14 IST
సాక్షి, హైదరాబాద్‌: ప్రస్తుత పార్లమెంట్‌ ఎన్నికల్లో కాంగ్రెస్‌ పరువు నిలుపుకునే స్థాయిలో సీట్లు సాధించుకున్నా.. పార్టీ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ ప్రచారం...
24-05-2019
May 24, 2019, 04:12 IST
రాష్ట్రంలో వైఎస్సార్‌సీపీ ప్రభంజనానికి తెలుగుదేశం పార్టీ కకావికలమైంది. 2019 ఎన్నికల్లో అసెంబ్లీ, లోక్‌సభ స్థానాల్లో ఫ్యాను గాలి హోరులో తెలుగుదేశం...
24-05-2019
May 24, 2019, 04:08 IST
న్యూఢిల్లీ: తాజాగా దక్కిన అధికారం ప్రధాని నరేంద్ర మోదీ పెట్టుబడి నిబంధనలను మరింత సడలించేందుకు అవకాశం ఇస్తుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది....
24-05-2019
May 24, 2019, 04:07 IST
సాక్షి, హైదరాబాద్‌: హైదరాబాద్‌ లోక్‌సభ స్థానంలో మజ్లిస్‌ పార్టీ వరసగా పదో విజయాన్ని నమోదు చేసుకుంది. మజ్లిస్‌ అధినేత అసదుద్దీన్‌...
24-05-2019
May 24, 2019, 04:02 IST
సాక్షి, అమరావతి: చంద్రబాబు కుట్రలు, కుయుక్తులు, పన్నాగాలు, మాయోపాయాలకు ఆంధ్రప్రదేశ్‌ ప్రజలు సరైన రీతిలో తగిన బుద్ధి చెప్పారు. ఈ...
24-05-2019
May 24, 2019, 03:57 IST
సాక్షి, హైదరాబాద్‌ : లోక్‌సభ ఎన్నికల ఫలితాలు రాష్ట్ర కాంగ్రెస్‌ పార్టీకి మిశ్రమ అనుభవాన్ని మిగిల్చాయి. కేంద్రంలో అధికారం వస్తుందని...
24-05-2019
May 24, 2019, 03:47 IST
సాక్షి, హైదరాబాద్‌: లోక్‌సభ ఎన్నికల్లో 8 స్థానాల్లో విజయం సాధిస్తామని తాము భావించామని, అయితే 3 స్థానాల్లో గెలుపొందినా తాము...
24-05-2019
May 24, 2019, 03:42 IST
అనేక దశాబ్దాలుగా గెలుస్తూ తమ కంచుకోటలుగా భావించే నియోజకవర్గాల్లోనూ ఈసారి తెలుగు దేశం ఘోరంగా ఓడింది. ఈ క్రమంలో ముఖ్యమంత్రి...
24-05-2019
May 24, 2019, 03:33 IST
సాక్షి, హైదరాబాద్‌: టీఆర్‌ఎస్‌ పార్టీకి లోక్‌సభ ఎన్నికలు మిశ్రమ ఫలితాలను అందించాయి. 5 నెలల క్రితం జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో...
24-05-2019
May 24, 2019, 03:20 IST
సాక్షి, హైదరాబాద్‌ అసెంబ్లీ ఎన్నికల్లో 88 స్థానాల్లో గెలుపొందిన అధికార టీఆర్‌ఎస్‌.. పార్లమెంటు ఎన్నికల్లో ఆ జోరును కొనసాగించలేకపోయిందని గురువారం వెలువడిన...
24-05-2019
May 24, 2019, 03:14 IST
సాక్షి, అమరావతి: జగన్‌ ప్రభంజనం ఆంధ్రప్రదేశ్‌ లో సరికొత్త రాజకీయ విప్లవాన్ని సృష్టించింది. రికా ర్డు స్థాయి విజయంతో వైఎస్సార్‌...
24-05-2019
May 24, 2019, 03:05 IST
సాక్షి, హైదరాబాద్‌ సార్వత్రిక ఎన్నికల ఫలితాల్లో టీఆర్‌ఎస్‌ సత్తాచాటింది. మొత్తం 17 స్థానాలకు గానూ 9 చోట్ల గెలిచి ఆధిపత్యం చాటుకుంది....
24-05-2019
May 24, 2019, 03:03 IST
ప్రధాని మోదీ కరిష్మాకు యావద్భారతం మరోసారి జై కొట్టింది. ‘సబ్‌కా సాథ్, సబ్‌కా వికాస్‌’ అన్న నరేంద్రుని నినాదానికి ఫిదా అయిపోయింది....
24-05-2019
May 24, 2019, 01:06 IST
ప్రపంచంలోనే అతి పెద్ద ప్రభంజనాల్లో న్యూ సౌత్‌ వేల్స్‌ లోని కేప్‌ ఫియర్‌ ఒకటి. 2019 సార్వత్రిక ఎన్నికల్లో భారతదేశం...
23-05-2019
May 23, 2019, 22:41 IST
సాక్షి, హైదరాబాద్‌: లోక్‌సభ ఎన్నికల్లో ఎనిమిది స్థానాల్లో విజయం సాధిస్తామని తాము భావించామని, అయితే మూడు స్థానాల్లో గెలుపొందినా తాము...
23-05-2019
May 23, 2019, 22:10 IST
అన్న బాణం.. దూసుకెళ్లిన షర్మిల..
Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top