కేసీఆర్‌ 31 జిల్లాల పేర్లు పలకగలరా? | NVSS Prabhakar Slams KCR | Sakshi
Sakshi News home page

కేసీఆర్‌ 31 జిల్లాల పేర్లు పలకగలరా?

Aug 21 2019 4:42 PM | Updated on Aug 21 2019 4:45 PM

NVSS Prabhakar Slams KCR - Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ 31 జిల్లాల పేర్లు పలకగలరా అని బీజేపీ మాజీ ఎమ్మెల్యే ఎన్‌వీఎస్‌ఎస్‌ ప్రభాకర్‌ ప్రశ్నించారు. తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా అవినీతి విస్తరించిందని.. మంగళవారం జరిగిన కలెక్టర్ల సమావేశంతో ఈ విషయం స్పష్టమైందన్నారు. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కేసీఆర్‌ ఎప్పుడేం మాట్లాడుతారో అర్థంకాక అధికారులు అయోమయంలో పడుతున్నారని వ్యాఖ్యానించారు. కేసీఆర్‌ అనాలోచిత నిర్ణయాల వల్లే పరిపాలనలో తెలంగాణ స్ఫూర్తి కొరవడిందని విమర్శించారు. కేసీఆర్‌ ఒక్క జిల్లాలో కూడా సంపూర్ణంగా పర్యటించలేదని అన్నారు. ఎన్నికల కోసం తప్పా, పరిపాలన కోసం కేసీఆర్‌ ఎన్నడూ రాష్ట్రంలో పర్యటించలేదని మండిపడ్డారు. టీఆర్‌ఎస్‌ ప్రభుత్వానికి సిరిసిల్ల, గజ్వేల్‌ తప్ప ఇతర నియోజకవర్గాలు కనబడవా అని వ్యంగ్యాస్త్రాలు సంధించారు. 

Advertisement
 
Advertisement
Advertisement