టీడీపీకి మరో ఎదురుదెబ్బ

Nellore TDP Leader Koduru Kamalakar Reddy Joins YSRCP - Sakshi

సాక్షి, నెల్లూరు: రాష్ట్ర వ్యాప్తంగా తెలుగు దేశం పార్టీకి దెబ్బ మీద దెబ్బ తగులుతున్నాయి. తాజాగా నెల్లూరు జిల్లాలో టీడీపీకి షాక్‌ తగిలింది. టీడీపీ సీనియర్‌ నేత, మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి అనుచరుడు కోడూరు కమలాకర్‌రెడ్డి శనివారం వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీలో చేరారు. ఆయనను నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. కార్యకర్తలు పెద్ద ఎత్తున ఈ కార్యక్రమానికి తరలిరావడంతో సందడి వాతావరణం నెలకొంది. నెల్లూరు రూరల్‌ వైఎస్సార్‌సీపీ ఇన్‌చార్జి కోటంరెడ్డి గిరిధర్‌రెడ్డి, కొండ్రెడ్డి రంగారెడ్డి, వైవీ రామిరెడ్డి, రూపకుమార్‌ యాదవ్‌, తాటి వెంకటేశ్వరరావు, బిరదవోలు శ్రీకాంత్‌రెడ్డి, మిద్దె మురళీకృష్ణ యాదవ్‌ తదితర నేతలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

టీడీపీ అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలతోనే కమలాకర్‌రెడ్డి పార్టీ మారినట్టు తెలుస్తోంది. అసెంబ్లీ ఎన్నికల్లో ఘోరంగా ఓడిపోయినప్పటికీ వైఖరి మార్చుకోకపోవడంతో రాష్ట్ర వ్యాప్తంగా సీనియర్‌ నాయకులు టీడీపీని వీడుతున్నారు. నెల్లూరు జిల్లాలో కీలక నేతగా ఉన్న కమలాకర్‌రెడ్డి తాజాగా వైఎస్సార్‌సీపీలో చేరడంతో నెల్లూరు రూరల్‌లో దాదాపు టీడీపీ ఖాళీ అయింది. కాగా, తూర్పు గోదావరి జిల్లా టీడీపీ సీనియర్‌ నాయకుడు, రామచంద్రాపురం మాజీ ఎమ్మెల్యే తోట త్రిమూర్తులు ఈనెల 15న వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీలో చేరిన విషయం తెలిసిందే. (చదవండి: వైఎస్సార్‌సీపీలోకి తోట త్రిమూర్తులు)

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top