‘బుద్ధ విగ్రహం ఏర్పాటులో లక్షల రూపాయల అవినీతి’

Nagam Janardhan Reddy Fires On Marri Janardhan Reddy In Nagar Kurnool - Sakshi

సాక్షి, నాగర్‌ కర్నూల్‌ జిల్లా : కేసరి సముద్రం చెరువు కట్ట మరమ్మత్తులో మర్రి జనార్ధన్‌ రెడ్డి భారీ అవినీతికి పల్పాడ్డారంటూ మాజీ మంత్రి, కాంగ్రెస్‌ సీనియర్‌ నాయకుడు నాగం జనార్దన్‌రెడ్డి ఆరోపించారు. శనివారమిక్కడ ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. కేసరి సముద్రం చెరువు మరమత్తులో మర్రి జనార్దన్‌ రెడ్డి వందల కోట్ల ప్రజధనాన్ని లూటీ చేశారంటూ మండిపడ్డారు. చెరువు కట్టపై జరిగిన సీసీ రోడ్ల నిర్మాణంలో టెండర్లు ఆమోదం కాకుండానే.. అగ్రిమెంట్లు లేకుండానే పనులు ఎలా జరిగాయో చెప్పాలంటూ మర్రి జనార్దన్‌ రెడ్డిని డిమాండ్‌ చేశారు.

చెరువు కట్టపై నాలుగు కోట్ల రూపాయల అభివుద్ధి పనులు కూడా జరగలేదు.. కానీ పదిహేడున్నర కోట్ల రూపాయల పనులు జరిగినట్లు చెప్తున్నారంటూ మండిపడ్డారు. బుద్ధ విగ్రహం, దిమ్మెలైట్లు ఇతర మెటీరియల్‌ ఏర్పాట్లలో లక్షల రూపాయల అవినీతి చోటు చేసుకుందని ఆరోపించారు. కాంట్రక్టర్‌ నల్లమట్టిని వందల కోట్ల రూపాయలకు అమ్ముకుని.. వేల ఎకరాల పంట భూమిని ఎండ పెట్టారు.. ఇదెక్కడి న్యాయమంటూ నాగం ప్రశ్నించారు.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top