మిలింద్‌కు ముకేశ్‌ మద్దతు

Mukesh Ambani backs Congress Milind Deora - Sakshi

ముంబై: సార్వత్రిక ఎన్నికల వేళ మహారాష్ట్రలో ఆసక్తికరమైన పరిణామం చోటుచేసుకుంది. దక్షిణ ముంబై కాంగ్రెస్‌ అభ్యర్థి మిలింద్‌ దేవ్‌రాకు దేశంలోనే అత్యంత ధనికుడైన ముకేశ్‌ అంబానీ మద్దతు పలికారు. ‘మిలింద్‌ దక్షిణ ముంబై వ్యక్తి. ఈ నియోజకవర్గానికి సంబంధించి సామాజిక, ఆర్థిక, సాంస్కృతిక పరిస్థితులపై ఆయనకు లోతైన అవగాహన ఉంది’ అని ముకేశ్‌ అన్నారు. ‘దక్షిణ ముంబై అంటే వ్యాపారమే. ముంబైలో వ్యాపారాన్ని అభివృద్ధి చేయడంతో పాటు మన యువతకు ఉపాధి కల్పించడానికి అధిక ప్రాధాన్యత ఇస్తున్నాం. ముకేశ్‌ అంబానీ లేదా ఉదయ్‌ కొటక్‌లో ఎవరు మద్దతు తెలిపినా భారీ ప్రచారం లభిస్తుందని నాకు తెలుసు’ అని మిలింద్‌ అన్నారు. రఫేల్‌ వివాదంలో ముకేశ్‌ తమ్ముడు అనిల్‌ అంబానీని రాహుల్‌ విమర్శిస్తుండగా, కాంగ్రెస్‌ అభ్యర్ధికి ముకేశ్‌ మద్దతుపలకడం గమనార్హం.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top