బీజేపీని ‘వెంకన్న చౌదరి’ అడ్డుకున్నాడు | MP Murali Mohan Calls Lord Venkateswara As Venkanna Chowdary | Sakshi
Sakshi News home page

‘వెంకన్న చౌదరి’ బీజేపీని అడ్డుకున్నాడు : ఎంపీ

May 24 2018 10:53 AM | Updated on Aug 10 2018 8:42 PM

MP Murali Mohan Calls Lord Venkateswara As Venkanna Chowdary - Sakshi

టీడీపీ సమావేశంలో మాట్లాడుతున్న ఎంపీ మురళీ మోహన్‌

సాక్షి, హైదరాబాద్‌ : కలియుగ దైవం శ్రీ వేంకటేశ్వర స్వామిని తెలుగుదేశం పార్టీ(టీడీపీ) ఎంపీ మురళీ మోహన్‌ ‘వెంకన్న చౌదరి’ అని సంబోధించారు. కర్ణాటక ఎన్నికల్లో రకరకాల మతలబులు చేసినప్పటికీ  భారతీయ జనతా పార్టీ(బీజేపీ)కి మెజార్టీ రాకపోవడానికి కారణం మా తిరుమల తిరుపతి వెంకన్న చౌదరి అంటూ వ్యాఖ్యానించారు.

రాజమండ్రిలో పార్టీ నేతల సమావేశం సందర్భంగా  మురళీమోహన్‌ ఈ వ్యాఖ్యలు చేశారు. కర్ణాటక ఎన్నికలు అయిన తర్వాత చంద్రబాబుకు చుక్కలు చూపిస్తామని బీజేపీ నాయకులు చేసిన వ్యాఖ్యలను ఆయన ఖండించారు. ఆకాశంలో కోట్ల కొలది నక్షత్రాలు ఉన్నా చంద్రుడు మాత్రం ఒక్కడే అనే విషయం గుర్తు పెట్టుకోవాలని మురళీమోహన్‌ పేర్కొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement