పవన్‌ ఎందుకు నోరు మెదడపడం లేదు?

Minister Vellampalli Srinivas Demands CBI Enquiry On Chandrababu Corruption - Sakshi

సాక్షి, విజయవాడ/ రాజమండ్రి : టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు కమీషన్ల బాగోతాన్ని ఆదాయపు పన్ను శాఖ బట్టబయలు చేసిన సంగతి తెలిసిందే. దీంతో చంద్రబాబు ఆయన తనయుడు లోకేశ్‌ అవినీతిపై పూర్తిస్థాయి విచారణ జరిపించాలనే డిమాండ్‌ సర్వత్రా వినిపిస్తోంది. ఒక మాజీ వ్యక్తిగత కార్యదర్శి దగ్గరనే రూ. 2వేల కోట్ల అవినీతి బయటపడిందంటే చంద్రబాబు దగ్గర లక్షల కోట్ల అవినీతి బయటపడుతుందని దేవదాయశాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్‌ విమర్శించారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. చంద్రబాబు దోచుకున్న సొమ్మును కేంద్ర ప్రభుత్వం కక్కించాలని కోరారు. తన అవినీతి బయట పడుతుందనే చంద్రబాబు సీబీఐని రాష్ట్రంలోకి రాకుండా అడ్డుకున్నారని గుర్తుచేశారు. రూ. 2వేల కోట్ల అవినీతిపై జనసేన అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్‌ ఎందుకు నోరు మెదపడం లేదని సూటిగా ప్రశ్నించారు. 

చంద్రబాబు అవినీతిలో పవన్‌కు కూడా భాగస్వామ్యం ఉందని ఆరోపించారు. చంద్రబాబు అవినీతి వామపక్షాలకు కనిపించడం లేదా అని ప్రశ్నించారు. బాబు బినామీల దగ్గర ఐటీ దాడులు జరిగితే పది సంవత్సరాల రాష్ట్ర బడ్జెట్‌కు సరిపడినంత డబ్బు దొరుకుతుందని విమర్శించారు. చంద్రబాబు అవినీతిపై ఈడీ, సీబీఐ విచారణ జరపాలని డిమాండ్‌ చేశారు. (చదవండి : మచ్చుకు రూ.2,000 కోట్లు)

ఎన్ని లక్షల కోట్లు బయటపడతాయో.. : మార్గాని భరత్‌ 
టీడీపీ ముఖ్య నేతలపై ఐటీ దృష్టి సారిస్తే ఎన్ని లక్షల కోట్లు బయటపడతాయో అని వైఎస్సార్‌సీపీ ఎంపీ మార్గాని భరత్‌ అన్నారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. టీడీపీ నేతలు సంపాదించిన అక్రమ ఆదాయం ఇప్పుడు వెల్లడవుతుందని తెలిపారు. నాలుగైదు చోట్ల సోదాలు చేస్తేనే వేల కోట్ల రూపాయలు బయటపడ్డాయని గుర్తుచేశారు. ఐటీ దాడులపై చంద్రబాబు ఒక్క మాట కూడా ఎందుకు మాట్లాడటం లేదని సూటిగా ప్రశ్నించారు. ఐటీ దాడులు ఇలాగే కొనసాగితే టీడీపీ అక్రమాలు మరిన్ని బయటపడే అవకాశం ఉందన్నారు. (చదవండి : రూ. 2 వేల కోట్లు: హైదరాబాద్‌కు చంద్రబాబు పయనం!)

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top