మీడియాను బహిష్కరిస్తున్నా: కుమారస్వామి | Kumaraswamy tells media is boycotting them | Sakshi
Sakshi News home page

మీడియాను బహిష్కరిస్తున్నా: కుమారస్వామి

Apr 29 2019 3:38 AM | Updated on Apr 29 2019 3:38 AM

Kumaraswamy tells media is boycotting them - Sakshi

సాక్షి, బెంగళూరు: కర్ణాటక ముఖ్యమంత్రి కుమారస్వామి మీడియాపై అలిగారు. మీడియాను తాను బహిష్కరిస్తున్నానని ప్రకటించారు. బెంగళూరులోని ఓ హోటల్‌లో కాంగ్రెస్‌ పార్టీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్‌తో కుమారస్వామి ఆదివారం సమావేశమయ్యారు. అనంతరం బయటకురాగానే కుమారస్వామిని చుట్టుముట్టిన మీడియా, సమావేశంలో ఏం చర్చించారని ప్రశ్నించింది. ఒక్కసారిగా సహనం కోల్పోయిన కుమారస్వామి..‘మీరంతా(మీడియా) వార్తల కోసం ఏది కావాలంటే అది చేస్తారు. ఇప్పుడు కూడా అదే చేయండి. ఇష్టమొచ్చినట్లు రాసుకోండి. ఎంజాయ్‌ చేయండి. నాకు ఎలాంటి ఇబ్బంది లేదు’ అని రుసరుసలాడుతూ వెళ్లిపోయారు. తన కుమారుడు నిఖిల్, సినీనటి సుమలత బరిలో ఉన్న మాండ్యలో మీడియా సుమలతకే ప్రాధాన్యత ఇవ్వడంపై సీఎం అలకబూనినట్లు్ల తెలుస్తోంది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement