కోమటిరెడ్డికి కలిసొచ్చిన ఇల్లు | Komatireddy Venkat Reddy is preparing for nomination from home | Sakshi
Sakshi News home page

కోమటిరెడ్డికి కలిసొచ్చిన ఇల్లు

Nov 5 2018 4:56 AM | Updated on Mar 18 2019 9:02 PM

Komatireddy Venkat Reddy is preparing for nomination from home - Sakshi

నల్లగొండ: ఐదోసారి కూడా ఆ ఇంటి నుంచే నామినేషన్‌ వేసేందుకు కాంగ్రెస్‌ నాయకుడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి సన్నాహాలు చేసుకుంటున్నారు. మాజీ మంత్రి, నల్లగొండ మాజీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి జిల్లా కేంద్రం నల్లగొండలోని హైదరాబాద్‌ రోడ్డులో గల మీర్‌బాగ్‌ కాలనీలో ఓ ఇంటిని అద్దెకు తీసుకున్నారు.

మొదటిసారి 1999 ఎన్నికల్లో పోటీ చేసినప్పుడు ఆ ఇంటి నుంచే బయల్దేరి.. నామినేషన్‌ వేశారు. వరుసగా నాలుగుసార్లు కూడా అలాగే చేసి విజయం సాధించారు. దీంతో ఆ ఇల్లు ఆయనకు సెంటిమెంటుగా మారిపోయింది. అప్పట్లో ఆ ఇంటి అద్దె రూ.3 వేలు. ఇప్పుడు రూ.31 వేలు. ఇప్పటికీ ఆయన అదే ఇంట్లో ఉంటున్నారు. ఈసారీ అక్కడి నుంచే నామినేషన్‌కు సిద్ధమయ్యారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement