మున్సిపల్‌ ఎన్నికల్లో ఒంటరిగానే పోటీ: కోదండరాం | Kodandaram Speaks Over Municipal Elections | Sakshi
Sakshi News home page

మున్సిపల్‌ ఎన్నికల్లో ఒంటరిగానే పోటీ: కోదండరాం

Jan 7 2020 2:25 AM | Updated on Jan 7 2020 2:25 AM

Kodandaram Speaks Over Municipal Elections - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: మున్సిపల్‌ ఎన్నికల్లో ఒంటరిగానే పోటీ చేస్తామని తెలంగాణ జన సమితి(టీజేఎస్‌) రాష్ట్ర అధ్యక్షుడు కోదండరాం స్పష్టంచేశారు. సోమవారం టీజేఎస్‌ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ మున్సిపల్‌ ఎన్నికల మేనిఫెస్టో 2 రోజుల్లో విడుదల చేస్తామన్నారు. టీఆర్‌ఎస్‌ డబ్బులు పంచి గెలవాలని చూస్తోందని, ఓటర్ల జాబితాలో అవకతవకలున్నాయని ఆరోపించారు. జేఎన్‌యూలో జరిగిన ఘటన అప్రజాస్వామికమని, దీన్ని ఖండిస్తున్నామన్నారు. అలాగే యోగేంద్రయాదవ్‌పై జరిగిన దాడిని ఖండించాలని పిలుపునిచ్చారు. ఈనెల 8న నిర్వహించే గ్రామీణ భారత్‌ బంద్‌కు తాము సంపూర్ణ మద్దతు తెలుపుతున్నామన్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement