అనుపమ్‌ ఖేర్‌ మంచి నటుడే కానీ.. !

Kher a good actor but some of his comments political, says Congress - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: జాతీయ టెలివిజన్‌, ఫిల్మ్‌ ఇన్‌స్టిట్యూట్‌ (ఎఫ్‌టీఐఐ) చైర్మన్‌గా ప్రముఖ నటుడు అనుపమ్‌ ఖేర్‌ను నియమించడంపై కాంగ్రెస్‌ పార్టీ స్పందించింది. అనుపమ్ ఖేర్‌ మంచి నటుడే కానీ.. ఆయన చేసే వ్యాఖ్యలు రాజకీయపరంగా ఉంటాయని అభ్యంతరం వ్యక్తం చేసింది.

ఎఫ్‌టీఐఐ చైర్మన్‌గా అనుపమ్‌ను నియమించడంపై కాంగ్రెస్‌ అధికార ప్రతినిధి ఆర్పీఎన్‌ సింగ్‌ను మీడియా ప్రతినిధులు ప్రశ్నించగా.. నటుడిగా అనుపమ్‌ చాలా గొప్ప పాత్రలు పోషించారని, ఎఫ్‌టీఐఐ పురోగతి కోసం ఆయన పనిచేసే అవకాశముందని పేర్కొన్నారు.

'ఆయన టీవీలోనూ, వెండితెరపై మంచి అభినయాన్ని కనబర్చారనే విషయంలో సందేహం లేదు. కానీ ఆయనను ఎఫ్‌టీఐఐ చైర్మన్‌గా ఎందుకు నియమించారో మీకు, నాకు దేశం మొత్తానికి తెలుసు. కేవలం ఆయన నటన నైపుణ్యం మీద ఆధారపడి ఈ నియామకం జరగలేదు. ఆయన ఇటీవల సినిమాల కన్నా రాజకీయాల గురించే ఎక్కువగా వ్యాఖ్యలు చేస్తున్న విషయం తెలిసిందే' అని ఆర్పీఎన్‌ సింగ్‌ అన్నారు.

ఐదు వేలకుపైగా సినిమాల్లో నటించి విలక్షణ నటుడిగా పేరొందిన అనుపమ్‌ ఖేర్‌ ప్రధాని నరేంద్రమోదీకి గట్టి మద్దతుదారు. మోదీకి, బీజేపీకి అనుకూలంగా వ్యవహరించినందుకే ఆయన ఎఫ్‌టీఐఐ చైర్మన్‌గా పదవి లభించినట్టు విమర్శలు వినిపిస్తున్నాయి.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top