ఈ దాడి వెనుక చంద్రబాబు హస్తం ఉంది | Karumuri Nageswara Rao Reacts Attacks On Nandigam Suresh | Sakshi
Sakshi News home page

బాబు చరిత్రహీనులుగా మిగిలిపోతారు

Feb 25 2020 1:57 PM | Updated on Feb 25 2020 2:01 PM

Karumuri Nageswara Rao Reacts Attacks On Nandigam Suresh - Sakshi

సాక్షి, పశ్చిమ గోదావరి: దళిత ఎంపీ నందిగం సురేష్‌పై దాడిని తణుకు ఎమ్మెల్యే కారుమూరి వెంకట నాగేశ్వరరావు తీవ్రంగా ఖండించారు. ఈ ఘటనపై మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ అమరావతిలో నందిగం సురేష్‌పై రెండో సారి దాడి చేయడం దారుణమన్నారు. ఈ దాడి వెనుక నూటికి నూరుపాళ్లు చంద్రబాబు హస్తం ఉందన్నారు. ఉద్దేశపూర్వకంగానే దాడులు చేసినప్పటికీ పోలీసులు చాలా ఓపికతో సమన్వయం పాటిస్తున్నారని తెలిపారు. ఇక అమరావతి రిలే నిరాహార దీక్షల్లో కొన్ని అసాంఘిక, కుట్రపూరిత శక్తులు చేరాయని విమర్శించారు. (చింతమనేనిని చూసి నేర్చుకోవాలా బాబూ!)

అమరావతి దీక్షలు చేయడానికి తణుకు నుంచి కూడా డబ్బులిచ్చి జనాన్ని తరలిస్తున్నారని ఎద్దేవా చేశారు. ఇప్పటికైనా చంద్రబాబు ఇటువంటి చర్యలు మానుకోకపోతే చరిత్ర హీనులుగా మిగిలిపోతారని హెచ్చరించారు. కాగా గుంటూరు జిల్లా అమరావతి మండలం లేమల్లె గ్రామంలో ఆదివారం టీడీపీ నాయకులు మహిళలతో ఎంపీ నందిగం సురేష్‌పై, ఆయన గన్‌మెన్, అనుచరులపై దాడి చేయించిన విషయం తెలిసిందే. (ఎంపీ సురేష్‌పై టీడీపీ నేతల దాడి)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement