కాళోజీకి తప్పని ఓటమి

Kaloji Narayan Rao Loss in 1952 Loksabha Elections - Sakshi

అభ్యర్థి ఏ పార్టీవాడని కాదు, ఏ పాటి వాడో చూడు అని ప్రజలను అప్రమత్తం చేసిన ప్రముఖ కవి కాళోజీ నారాయణరావు సైతం ఎన్నికల్లో ఓడిపోయారు. 1952లో ఆయన తెలంగాణలోని వరంగల్‌ లోక్‌సభ స్థానం నుంచి కాంగ్రెస్‌ అభ్యర్థిగా పోటీ చేశారు. పీడీఎఫ్‌ అభ్యర్థి పెండ్యాల రాఘవరావు కాళోజీపై గెలిచారు. ఎమర్జెన్సీకి నిరసనగా కాళోజీ ఖమ్మం జిల్లా సత్తుపల్లిలో అప్పటి ముఖ్యమంత్రి జలగం వెంగళరావుపై 1978లో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి మళ్లీ ఓటమి పాలయ్యారు. వరంగల్‌ జిల్లాకే చెందిన మరో అదర్శ వ్యక్తి భూపతి కృష్ణమూర్తి కూడా 1972, 1978, 1983 ఎన్నికల్లో వరంగల్‌ నుంచి అసెంబ్లీకి వేర్వేరు పార్టీల తరఫున బరిలోకి దిగారు. అయితే మూడుసార్లు ఓడిపోయారు.   

ఆంధ్రప్రదేశ్‌లో 1961లో జరిగిన నియోజకవర్గాల పునర్విభజన ప్రకారం 300 అసెంబ్లీ నియోజకవర్గాలు ఏర్పాటయ్యాయి. అందులో 43 స్థానాలు ఎస్సీలకు, 11 స్థానాలు ఎస్టీలకు కేటాయించారు. అనంతరం 1962 ఫిబ్రవరి 19న రాష్ట్రంలో అసెంబ్లీకి మూడో సారి ఎన్నికలు జరిగాయి. ఆ ఎన్నికల్లో కాంగ్రెస్‌ 177 స్థానాలు, సీపీఐ 51, స్వతంత్ర పార్టీ 19 స్థానాల్లో గెలుపొందగా.. ఇండిపెండెంట్లు 51 స్థానాల్లో విజయం సాధించారు. బీవీ సుబ్బారెడ్డి స్పీకర్‌గా, వి.కృష్ణాజీ నాయక్‌ డిప్యూటీ స్పీకర్‌గా ఎంపికయ్యారు. మూడో అసెంబ్లీ గడువు ముగిసేలోగా నీలం సంజీవరెడ్డి, కాసు బ్రహ్మానందరెడ్డిలు ముఖ్యమంత్రులుగా పనిచేశారు. 

300 మందితోమూడో అసెంబ్లీ

1951 నుంచి 2019 వరకులోక్‌సభ ఎన్నికల నిర్వహణ..ఇన్ని రోజుల్లో..

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top