‘కాంగ్రెస్‌తోనే ప్రజలకు న్యాయం’

Justice To The People With Congress, Says Bhatti Vikramarka - Sakshi

బీసీలను వెనక్కి నెడుతోన్న టీఆర్‌ఎస్‌

బీసీలు సమష్టిగా ముందుకెళితేనే అభివృద్ధి

సాక్షి, మహబూబ్‌ నగర్‌ : కాంగ్రెస్‌ పార్టీవల్లే దళిత, బహుజన, బడుగు, బలహీన వర్గాల ప్రజలకు న్యాయం జరుగుతుందని టీపీసీసీ వర్కంగ్ ప్రెసిడెంట్ మల్లు భట్టివిక్రమార్క అన్నారు. మహబూబ్‌ నగర్‌లో శనివారం జరిగిన కాంగ్రెస్‌ పార్టీ ఓబీసీ సెల్‌ సమావేశంలో ఆయన పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. కాంగ్రెస్‌ ప్రభుత్వ హయాంలో బీసీలు ఆర్ధిక, సామాజిక, విద్య, ఉద్యోగాల వంటి అన్ని రంగాల్లో ముందున్నారని కానీ టీఆర్‌ఎస్‌ అధికారంలోకి వచ్చిన తర్వాత వారిని దశాబ్దాల వెనక్కు నెట్టిందని మండిపడ్డారు. అధికారంలో ఉన్నా లేకున్నా.. కాంగ్రెస్  ప్రజల అభివృద్ధికి పాటుపడుతుందన్నారు.

కాంగ్రెస్‌ అధికారంలో ఉన్నప్పుడు ఫీజు రీయింబర్స్‌మెంట్‌తో బీసీ విద్యార్ధుల్ని ఉన్నత చదువులు చదివేలా ప్రోత్సహించామని, దాంతో వారు ఉన్నత ఉద్యోగాల్లో స్థిరపడ్డారని అన్నారు. తమ ప్రభుత్వ హయాంలో హైదరాబాద్ లో ఐఐటీ, ట్రిపుల్ ఐటీ వంటి విద్యాసంస్థలను తీసుకువస్తే టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం బీసీలకు గొర్రెలు.. బర్రెలు అంటూ తప్పుదోవ పట్టిస్తుందని ఆరోపించారు. బీసీలు సమష్టిగా ముందుకు వెళితేనే ఆర్థిక, రాజకీయ, సామాజికంగా ఎదుగుతామని భట్టి విక్రమార్క స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ పార్లమెంట్ సభ్యుడు వి. హనుమంతరావు, బీసీ నేత చిత్తరంజన్ దాస్ తదితరులు పాల్గొన్నారు.
 

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top