‘నేను పార్టీ మారడం లేదు’

Jupally Krishna Rao Opens Over Rumours Of Quitting TRS Party - Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : తాను పార్టీ మారుతున్నట్లు వస్తున్న వార్తలు ఆవాస్తమని మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. ప్రతిపక్షాలు కావాలనే తనపై ఇలాంటి దుష్ప్రచారం చేస్తున్నాయని ఆరోపించారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. తాను పూటకో పార్టీ మారే వ్యక్తిని కాదన్నారు. కావాలనే కొందరు తనపై కుట్రపన్ని పార్టీ మారతారంటూ దష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. పార్టీ మారే ప్రసక్తే లేదని, సీఎం కేసీఆర్‌, పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ నాయకత్వంలో టీఆర్‌ఎస్‌లోనే కొనసాగుతానని స్పష్టం చేశారు. ఎమ్మెల్యేగా ఓడిపోయినా.. కొల్లాపూర్‌ ప్రజల అభివృద్ధి కోసం కృషి చేస్తానని చెప్పారు. కాగా గత అసెంబ్లీ ఎన్నికల్లో  కొల్లాపూర్‌ నుంచి పోటీ చేసిన జూపల్లి.. కాంగ్రెస్‌ అభ్యర్థి హర్షవర్థన్‌రెడ్డి చేతిలో ఘోరంగా ఓడిపోయారు.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter


Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top