‘ముందస్తు’ ఓటమి కోసమే: జైపాల్‌రెడ్డి

Jaipal reddy commented over kcr - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: రాష్ట్రంలో ప్రజా వ్యతిరేకతను మూట గట్టుకున్న సీఎం కేసీఆర్‌ ఆ అసంతృప్తి పెరగకుండా చూసుకునేందుకే ముందస్తు ఎన్నిలకు సిద్ధమవుతున్నారని కాంగ్రెస్‌ జాతీయ అధికార ప్రతినిధి జైపాల్‌రెడ్డి ధ్వజమెత్తారు. కేసీఆర్‌ ముందు ఎన్నికలకు వెళ్లే ఆయనకు ఎదురయ్యేది ముందుస్తు ఓటమేనని జోస్యం చెప్పారు. ముందస్తు ఎన్నికలకు వెళ్లి మళ్లీ అధికారం చేపట్టొచ్చని ప్రగతి భవన్‌లో కూర్చొని కేసీఆర్‌ కలలు కంటే నాడు చంద్రబాబుకు పట్టిన గతే పడుతుందని విమర్శించారు. మంగళవారం ఆయన ఢిల్లీలోని ఏఐసీసీ కార్యాలయంలో మాట్లాడారు.

నాలుగేళ్ల పాలనలో కేసీఆర్‌ ప్రభుత్వం ఒక్క హామీ కూడా నెరవేర్చలేదని, అందుకే ప్రజల్లో ఉన్న వ్యతి రేకత పెరుగుతుందనే భయంతోనే ముందస్తుకు వెళ్తున్నారని చెప్పారు. ‘ముందస్తుతో ఎక్కువ సంతో షించేది కాంగ్రెసే. తెలంగాణ ఇచ్చింది కాంగ్రెసే అని ప్రజల్లో బలంగా నాటుకుపోయింది. మాపై సాను కూలత ఏర్పడింది’ అని జైపాల్‌ చెప్పారు. జాతీయ పార్టీ అయిన కాంగ్రెస్‌లో సీఎం అభ్యర్థిత్వంపై పోటీ ఉండటం సహజమేనని, అధిష్టానం నిర్ణయమే శిరోధార్యం అని అన్నారు. నేతలను చూసి కాకుండా కాంగ్రెస్‌ను చూసే ఓటేస్తారని, వచ్చే ఎన్నికల్లో గెలుస్తామనేందుకు ఇదే తమ ధీమా అని వివరిం చారు. వచ్చే ఎన్నికల్లో టీడీపీతో పొత్తుపై అధిష్టా నానిదే తుది నిర్ణయం అని అన్నారు.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top