‘అంతర్గత హక్కును ఎవరు ప్రశ్నించలేరు’

India Slams China Over Jammu And Kashmir Bifurcation Interference - Sakshi

న్యూఢిల్లీ: భారత్‌ అంతర్గత చట్టాలను ఇష్టారీతిన మారుస్తుందన్న చైనా వాదనపై భారత్‌ ఆగ్రహం వ్యక్తం చేసింది. చైనా సార్వభౌమత్వానికి ఇబ్బంది కలిగేంచే చట్టాలను భారత్‌ రూపొందిస్తుందంటూ  చైనా విదేశాంగ ప్రతినిధి జెంగ్ షువాంగ్ ఆరోపించారు. ఈ సందర్భంగా భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి రవీష్ కుమార్ దీనిపై స్పందించారు. శుక్రవారం జరిగిన ఓ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. జమ్మూ కశ్మీర్‌ను రెండు కేంద్ర పాలిత ప్రాంతాలుగా విభజించడం భారత్‌ అంతర్గత విషయమని స్పష్టం చేశారు. ఈ అంశంలో చైనా అనవసరంగా జోక్యం చేసుకుంటుందంటూ విమర్శించారు.

కాగా 1963లో చైనా-పాకిస్తాన్ చేసుకున్న సరిహద్దు ఒప్పందంలో భాగంగా చైనా భారత భూభాగాలను చట్టవిరుద్ధంగా స్వాధీనం చేసుకుంటోందని అన్నారు. అయితే జమ్మూకశ్మీర్‌, లడఖ్‌లలో చైనా ఆక్రమణలు నిరంతరం కొనసాగుతున్నాయని ఆయన మండిపడ్డారు. జమ్మూకశ్మీర్‌, లడఖ్‌లు భారత్‌లో అంతర్భాగమని స్పష్టం చేశారు. భారత్‌ అన్ని దేశాలను గౌరవిస్తుందని, అదే విధంగా ఇతర దేశాలు తమను గౌరవించాలని భారత్‌ కోరుకుంటుందని పేర్కొన్నారు.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top