ఇంట్లోనే దీక్ష కొనసాగిస్తా

Hardik Patel Continues Fast From Home - Sakshi

అహ్మదాబాద్‌: రైతు రుణమాఫీ, పటేళ్లకు రిజర్వేషన్ల డిమాండ్లతో గుజరాత్‌లో పాస్‌ (పటీదార్‌ అనామత్‌ ఆందోళన్‌ సమితి) కన్వీనర్‌ హార్దిక్‌ పటేల్‌ చేపట్టిన నిరవధిక నిరాహార దీక్ష కొనసాగుతోంది. గత నెల 25 నుంచి ఆయన దీక్ష చేస్తుండగా ఆరోగ్యం క్షీణించడంతో హార్దిక్‌ను శుక్రవారం ఆసుపత్రికి తరలించడం తెలిసిందే. తాజాగా ఆయన వైద్యశాల నుంచి డిశ్చార్జి అయ్యి, తన ఇంటివద్దనే 16వ రోజు దీక్ష కొనసాగించారు.

అంతకుముందు హార్దిక్‌ ఇంటికి వెళ్తుండగా ఆ దారిలో భారీ సంఖ్యలో పోలీసులను ప్రభుత్వం మోహరించింది. హార్దిక్‌ను అనుసరిస్తున్న విలేకరులను పోలీసులు అడ్డుకోవడంతోపాటు కొంతమందిపై లాఠీ చార్జీ కూడా చేశారు. పోలీసుల చర్యను హార్దిక్‌ ఖండించారు. ఆగస్టు 25న హార్దిక్‌ పటేల్‌ దీక్ష ప్రారంభించారు. మంచినీళ్లు తీసుకోవడం కూడా మానేయడంతో ఆయనను ఆస్పత్రికి తరలించారు. ఇంట్లోనే నిరహార దీక్ష కొనసాగిస్తానని ఫేస్‌బుక్‌ లైవ్‌ ద్వారా ఆయన ప్రకటించారు.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top