ఎన్నికల్లో ఐదు రూపాయల డాక్టర్‌ | Five rupees doctor enters poll battle in Mandya | Sakshi
Sakshi News home page

ఎన్నికల్లో ఐదు రూపాయల డాక్టర్‌

Apr 24 2018 8:00 AM | Updated on Oct 17 2018 6:27 PM

Five rupees doctor enters poll battle in Mandya - Sakshi

నామినేషన్‌ వేయడానికి వస్తున్న డాక్టర్‌ శంకరేగౌడ (కుడివైపున)

మండ్య: మండ్య నగరంలో ఐదు రూపాయల డాక్టర్‌గా ప్రసిద్ధి చెంది న డాక్టర్‌. ఎస్‌.సి. శంకరేగౌడ ఎన్నికల నాడిని పరీక్షిస్తున్నారు. సోమవారం ఆయన మండ్య స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్‌ దాఖలు చేశా రు. నగరంలోని బందీగౌడ లేఔట్‌లో ఉన్న నివాసం నుంచి కలెక్టర్‌ కార్యాలయానికి వెళ్లి అక్కడ ఉన్న మహా పురుషుల విగ్రహాలకు పూలహారం వేసి నివాళులర్పించారు. తరువాత తాలూకా పంచాయతీ కార్యాలయానికి వెళ్లి నామినేషన్‌ దాఖలు చేశారు. రోగుల నుంచి కేవలం ఐదు రూపాయలు ఫీజుగా తీసుకునే శంకరేగౌడ నామినేషన్‌ డిపాజిట్‌ నగదు రూ.10 వేలను కూడా ఐదు రూపాయల నాణేలనే ఇచ్చారు. 

Advertisement
 
Advertisement
Advertisement