60 మందితో కాంగ్రెస్‌ తొలి జాబితా?

First list of Congress with 60 members - Sakshi

సిట్టింగ్‌ ఎమ్మెల్యేలందరికీ ఓకే..  ఓడిపోయిన ముఖ్యులకూ చాన్స్‌

సాక్షి, హైదరాబాద్‌: ప్రధాన ప్రతిపక్షమైన కాంగ్రెస్‌ పార్టీ కూడా టికెట్ల కసరత్తులో కీలక దశకు చేరుకుంది. ఎమ్మెల్యే అభ్యర్థుల ప్రతిపాదన జాబితాను టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి గురువారం ఢిల్లీ తీసుకెళ్లారని, ఈ ప్రతిపాదనలపై చర్చించి అభ్యర్థులను హై కమాండ్‌ ఖరారు చేస్తుందని గాంధీభవన్‌ వర్గాలు చెబుతున్నాయి. ఈ మేరకు 60 మందితో కూడిన తొలి జాబితా ఖరారు కసరత్తు హస్తినకు చేరింది.

సిట్టింగ్‌ ఎమ్మెల్యేలందరికీ సీట్లు ఖాయమేనని, టీడీపీతో పొత్తు విషయంలో కోదాడ అసెంబ్లీ స్థానంపై కొంత సందిగ్ధం ఉన్నా.. ఆ సీటు టీడీపీకి ఇవ్వకపోతే అక్కడి సిట్టింగ్‌కే టికెట్‌ వస్తుందని తెలుస్తోంది. గత ఎన్నికల్లో ఓడిపోయిన ముఖ్యుల్లో చాలా మందికి ఈసారి కూడా పోటీ చేసే అవకాశమున్నట్టు సమాచారం. విశ్వసనీయ సమాచారం ప్రకారం ఈనెల 11న ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ మానస సరోవర్‌ యాత్ర నుంచి ఢిల్లీ చేరుకోనున్న నేపథ్యంలో.. 12న మరోమారు ఉత్తమ్‌ను ఢిల్లీకి రమ్మన్నారని, ఆ తర్వాత తొలి జాబితా ప్రకటించే అవకాశం ఉందని సమాచారం.

దాదాపుగా ఖరారైన అభ్యర్థులు
హుజూర్‌నగర్‌ – ఉత్తమ్‌కుమార్‌రెడ్డి;నాగార్జునసాగర్‌ – కె.జానారెడ్డి ; మధిర – మల్లు భట్టి విక్రమార్క ; నల్లగొండ – కోమటిరెడ్డి వెంకటరెడ్డి; గద్వాల – డీకే అరుణ; ఆలంపూర్‌ – ఎస్‌.సంపత్‌కుమార్‌;కొడంగల్‌ – రేవంత్‌రెడ్డి; పరిగి – టి.రామ్మోహన్‌రెడ్డి; నర్సంపేట – దొంతి మాధవరెడ్డి; జహీరాబాద్‌ – గీతారెడ్డి; కల్వకుర్తి – వంశీచంద్‌రెడ్డి; వనపర్తి – చిన్నారెడ్డి ; జగిత్యాల– జీవన్‌రెడ్డి; బోధన్‌ – సుదర్శన్‌రెడ్డి ; ఆర్మూర్‌ – సురేశ్‌రెడ్డి; నిజామాబాద్‌ (టౌన్‌)– మహేశ్‌కుమార్‌గౌడ్‌; కామారెడ్డి – షబ్బీర్‌ అలీ; నిర్మల్‌ – మహేశ్వర్‌రెడ్డి; సంగారెడ్డి – జగ్గారెడ్డి; నర్సాపూర్‌ – సునీతా లక్ష్మారెడ్డి;

ఆందోల్‌ – దామోదర రాజనర్సింహ; హుస్నాబాద్‌ – ప్రవీణ్‌రెడ్డి; ఎల్బీనగర్‌ – సుధీర్‌రెడ్డి; కుత్బుల్లాపూర్‌ – కూన శ్రీశైలం గౌడ్‌ ; రాజేంద్రనగర్‌ – కార్తీక్‌రెడ్డి; మహేశ్వరం – సబితా ఇంద్రారెడ్డి; ఉప్పల్‌ – బి.లక్ష్మారెడ్డి; జనగామ – పొన్నాల లక్ష్మయ్య; వర్ధన్నపేట – కొండేటి శ్రీధర్‌; ములుగు– సీతక్క; భూపాలపల్లి – గండ్ర వెంకటరమణారెడ్డి; డోర్నకల్‌ – రామచంద్రునాయక్‌; స్టేషన్‌ఘన్‌పూర్‌ – విజయరామారావు;పాలకుర్తి– జంగా రాఘవరెడ్డి; పాలేరు– పొంగులేటి సుధాకర్‌రెడ్డి; పినపాక– రేగా కాంతారావు; ఆలేరు– భిక్షమయ్యగౌడ్‌ ;

భువనగిరి– కుంభం అనిల్‌కుమార్‌రెడ్డి; దేవరకొండ – బిల్యానాయక్‌; మిర్యాలగూడ– కుందురు రఘువీర్‌రెడ్డి ; నాగర్‌కర్నూల్‌ – నాగం జనార్దనరెడ్డి; అచ్చంపేట – డాక్టర్‌.వంశీకృష్ణ; దేవరకద్ర – పవన్‌కుమార్‌రెడ్డి; షాద్‌నగర్‌ – సి.ప్రతాపరెడ్డి; కొల్లాపూర్‌– హర్షవర్ధన్‌రెడ్డి; నారాయణపేట్‌– శివకుమార్‌రెడ్డి; తాండూర్‌ – రమేశ్‌ మహరాజ్‌; మానకొండూరు – ఆరేపల్లి మోహన్‌; కంటోన్మెంట్‌ – క్రిశాంక్‌; మంథని – శ్రీధర్‌బాబు; పెద్దపల్లి – విజయరమణారావు; సిరిసిల్ల – కె.కె.మహేందర్‌రెడ్డి; చెన్నూరు – బోడ జనార్దన్‌; ఆసిఫాబాద్‌ – ఆత్రం సక్కు; బో«థ్‌ – సోయం బాపూరావు

వీరిలో అదృష్టం ఎవరికో..?
ఎల్లారెడ్డి– నల్లమడుగు సురేందర్‌/ వడ్డేపల్లి సుభాష్‌రెడ్డి; ఇబ్రహీంపట్నం– క్యామ మల్లేశ్‌/ మల్‌రెడ్డి రంగారెడ్డి; ఖమ్మం– వద్దిరాజు రవిచంద్ర/ పోట్ల నాగేశ్వరరావు;తుంగతుర్తి – అద్దంకి దయాకర్‌/ గుడిపాటి నర్సయ్య;సూర్యాపేట – దామోదర్‌రెడ్డి/ పటేల్‌ రమేశ్‌రెడ్డి;మునుగోడు – పాల్వాయి స్రవంతి/ కైలాశ్‌ నేత; రామగుండం – మక్కాన్‌ రాజ్‌ఠాకూర్‌/ కోరుకంటి చందర్‌; ధర్మపురి – లక్ష్మణ్‌కుమార్‌/ దరువు ఎల్లయ్య; చొప్పదండి – మేడిపల్లి సత్యం/ గజ్జెల కాంతం; వేములవాడ – ఆది శ్రీనివాస్‌/ పొన్నం ప్రభాకర్‌; సికింద్రాబాద్‌ – బండా కార్తీకరెడ్డి/ ఆదం సంతోశ్‌కుమార్‌; మేడ్చల్‌ – కె.లక్ష్మారెడ్డి/ తోటకూర జంగయ్య యాదవ్‌; ఆదిలాబాద్‌ – సి.రామచంద్రారెడ్డి/ భార్గవ్‌ దేశ్‌పాండే; మంచిర్యాల –అరవింద్‌రెడ్డి/ ప్రేంసాగర్‌రావు; మెదక్‌ – విజయశాంతి/ శశిధర్‌రెడ్డి; గజ్వేల్‌ – ప్రతాప్‌రెడ్డి/ బండారు శ్రీకాంత్‌.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top