కన్నబాబుపై జనసేన దుష్ప్రచారం

False Campaign In Social Media By Janasena Party Against YSRCP MLA Candidate Kurasala Kannababu - Sakshi

కాకినాడ(తూర్పుగోదావరి జిల్లా): కాకినాడ రూరల్‌ వైఎస్సార్‌సీపీ అభ్యర్థి కురసాల కన్నబాబుపై సోషల్‌ మీడియా వేదికగా జనసేన దుష్ప్రచారం చేస్తోంది. ఓటర్లకు డబ్బులు పంచుతున్నట్లుగా.. పోలీసులు అరెస్ట్‌ చేసి డబ్బులు స్వాధీనం చేసుకున్నట్లు పాత ఫోటోలతో మార్ఫింగ్‌ చేసి సోషల్‌ మీడియాలో పోస్టులు పెట్టారు. ఈ విషయం తెలిసి కన్నబాబు స్పందించారు. నాలుగు నెలల క్రిందట కూరాడ గ్రామంలో కాలుజారి పడిపోయిన దళిత వృద్ధురాలికి ధన సహాయం చేశానని, ఆ సమయంలో తీసిన ఫోటోను మార్ఫింగ్‌ చేసి ఇప్పుడు ఎన్నికల్లో డబ్బులు పంచుతున్నట్లుగా, పోలీసులు అరెస్ట్‌ చేసినట్లుగా జనసేన దుష్ప్రచారం చేస్తోందని విమర్శించారు.

ప్రత్యేక హోదా ఉద్యమ సమయంలో నాగమల్లితోట జంక్షన్‌ వద్ద సర్పవరం పోలీసులు అరెస్ట్‌ చేసిన ఫోటోను ఇటీవలే అరెస్ట్‌ చేసినట్లు జనసేన తప్పుడు ప్రచారం చేస్తోందని మండిపడ్డారు. జనసేన చేస్తోన్న తప్పుడు ప్రచారంపై కన్నబాబు జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేశారు. దీనిపై విచారించి నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top