వికారాబాద్‌ ఎస్పీపై బదిలీ వేటు

EC Transfers Vikarabad SP Annapurna Over Revanth Reddy Arrest Process - Sakshi

హెడ్‌క్వార్టర్స్‌లో రిపోర్ట్‌ చేయాలని డీజీపీ ఆదేశం

సాక్షి, వికారాబాద్‌: వికారాబాద్‌ ఎస్పీ అన్నపూర్ణపై బదిలీ వేటు పడింది. ఆమెను బదిలీ చేయాల ని ఎన్నికల సంఘం డీజీపీని ఆదేశించింది. దీంతో వెంటనే ఆమె హెడ్‌క్వార్టర్స్‌లో రిపోర్టు చేయాల ని ఆదేశిస్తూ డీజీపీ ఉత్తర్వులి చ్చారు. కొడంగల్‌ ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డిని ఆయన స్వగృహంలో అర్ధరాత్రి సమయంలో బలవం తంగా అరెస్టు చేయడాన్ని తప్పుపడుతూ కేంద్ర ఎన్నికల కమిషన్‌కు కాంగ్రెస్‌ జాతీయ నాయకులు కపిల్‌ సిబాల్‌ తదితరులు ఫిర్యాదు చేశారు.

అరెస్టు చట్టవిరుద్ధం అంటూ రేవంత్‌ తరఫు న్యాయవాదులు హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. దీంతో కోర్టు కూడా ఈ విషయంపై వివరణివ్వాలని డీజీపీ ని ఆదేశించిన సంగతి తెలిసిందే. రేవంత్‌ అరెస్టు వ్యవహారంలో అ న్నపూర్ణ అత్యుత్సాహం ప్రదర్శించారని, అవసరం లేకున్నా ఆయనను అరెస్టు చేసినందుకు ఆమెను బదిలీ చేసినట్లు తెలుస్తోంది. ఎన్నికలకు సంబంధించి ఎలాంటి విధులను ఆమెకు అప్పగించరాదని కమిషన్‌ ఆదేశించింది.

కొత్త ఎస్పీగా అవినాశ్‌ మహంతి...
వికారాబాద్‌ జిల్లా కొత్త ఎస్పీగా అవినాశ్‌ మహంతిని నియమిస్తూ డీజీపీ ఉత్తర్వులు జారీ చేశారు. బదిలీ వేటుపడిన ఎస్పీ అన్నపూర్ణ స్థానంలో ఆయనను నియమించా రు. ఈ ఉత్తర్వులు వెంటనే అమల్లోకి వస్తాయన్నారు.

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top