రేపు కాంగ్రెస్‌లోకి డీఎస్‌ | D Srinivas Will Join Congress Party Tomorrow | Sakshi
Sakshi News home page

Oct 26 2018 8:51 PM | Updated on Mar 18 2019 9:02 PM

D Srinivas Will Join Congress Party Tomorrow - Sakshi

డి.శ్రీనివాస్‌తో పాటు టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ రాములు నాయక్‌, గజ్వెల్‌ మాజీ ఎమ్మెల్యే..

సాక్షి, హైదరాబాద్‌ : టీఆర్‌ఎస్‌ పార్టీ రాజ్యసభ సభ్యుడు డి.శ్రీనివాస్‌ రేపు(శనివారం) ఉదయం 10 గంటలకు మళ్లీ కాంగ్రెస్‌ పార్టీ తీర్థం పుచ్చుకోనున్నారు. ఆ పార్టీ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ సమక్షంలో ఆయన పార్టీలో చేరనున్నారు. డి.శ్రీనివాస్‌తో పాటు టీఆర్‌ఎస్‌ బహిష్కృత నేత ఎమ్మెల్సీ రాములు నాయక్‌, గజ్వెల్‌ మాజీ ఎమ్మెల్యే నర్సారెడ్డిలు కాంగ్రెస్‌ కండువాలు కప్పుకోనున్నారు. గతంలో పార్టీ వ్యతిరేక కార్యకలాపాలు పాల్పడుతున్నారని ఆరోపిస్తూ డీఎస్‌ను టీఆర్‌ఎస్‌ నుంచి సస్పెండ్‌ చేయాలని జిల్లా ఎంపీ, ఎమ్మెల్యేలు అంతా ఏకగ్రీవంగా తీర్మానం చేసిన విషయం తెలిసిందే.

అప్పటి నుంచి ఆయన టీఆర్‌ఎస్‌కు దూరంగా ఉంటున్నారు. ఈ విషయంలో సీఎం కేసీఆర్‌ సైతం జోక్యం చేసుకోకపోవడంతో డీఎస్‌ పార్టీ వీడక తప్పలేదు. ఆయన రాకను కాంగ్రెస్‌ పార్టీలోని కొందరు సీనియర్‌ నేతలు వ్యతిరేకిస్తున్నా.. పాత పరిచయాలతో డీఎస్‌ మార్గం సుగమం చేసుకున్నారు.
 

Advertisement
 
Advertisement
Advertisement