సోనియా గాంధీకే మళ్లీ పార్టీ పగ్గాలు

CWC Picks Sonia Gandhi as Interim Congress President - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: సుదీర్ఘ చర్చలు, బుజ్జగింపులు, అనేక తర్జన భర్జనల అనంతరం తిరిగి కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షురాలిగా సోనియాగాంధీ నియమితులయ్యారు. శనివారం జరిగిన సీడబ్ల్యూసీ సమావేశంలో సుదీర్ఘ మంతనాలు జరిగాయి. ఈ చర్చలో మరోసారి రాహుల్‌ గాంధీ పేరు తెరపైకి వచ్చినట్టు తెలుస్తోంది. అయితే రాహుల్‌ మరోసారి సున్నితంగా తిరస్కరించాడు. దీంతో కొత్త అధ్యక్షుడిని ఎవరిని ఎన్నుకోవాలనే దానిపై సీడబ్ల్యూసీ తర్జన భర్జన పడింది. సుదీర్ఘ భేటి అనంతరం సోనియా గాంధీని తాత్కాలిక అధ్యక్షురాలిగా కొనసాగించాలని చివరికి సీడబ్ల్యూసీ నిర్ణయించింది. 

త్వరలో మరోసారి సమావేశమై కొత్త అధ్యక్షుడిని ఎన్నుకోవాలని నిర్ణయించినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం.  ప్రస్తుతం పార్టీ ఉన్న క్లిష్ట సమయంలో సోనియా గాంధీ మాత్రమే కాంగ్రెస్‌ పార్టీలో స్థైర్యం నింపగలరని సీడబ్ల్యూసీ భావించింది. ఈ మేరకు పార్టీ సీనియర్‌ గులాంనబీ అజాద్‌ ప్రకటించారు. సార్వత్రిక ఎన్నికల్లో దేశ వ్యాప్తంగా కాంగ్రెస్‌ ఘోర పరాజయం చవిచూడటంతో పార్టీ అధ్యక్ష పదవికి రాహుల్‌ గాంధీ రాజీనామా చేసిన విషయం తెలిసిందే. 

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top