కేసీఆర్‌ ప్రభుత్వంపై నిప్పులు చెరిగిన రేణుకా చౌదరీ

Congress Leader Renuka Chaudhary Fires On kcr Over Inter Board Issue - Sakshi

సాక్షి, ఖమ్మం : రాష్ట్రంలో 28 మంది విద్యార్థులను పొట్టనపెట్టుకున్న పాపం కేసీఆర్‌దే అంటూ కాంగ్రెస్‌ మాజీ మంత్రి రేణుకా చౌదరి మండిపడ్డారు. గురువారమిక్కడ ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడుతూ.. ఇంటర్‌ బోర్టు ఘటన టీఆర్‌ఎస్‌ ప్రభుత్వ పాలనకు నిదర్శనమన్నారు. ఇంటర్‌బోర్డు అవకతవకలపై ప్రభుత్వ తీరును ఆమె తీవ్రంగా ఖండించారు. ప్రజాస్వామ్యానికి అద్దం పట్టేలా ఖమ్మం పార్లమెంట్‌ ఎన్నిక జరిగిందని తెలిపారు.

జిల్లాలో జరుగుతున్న ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల్లో కూడా కాంగ్రెస్‌ పార్టీ అధిక స్థానాలు గెలుస్తుందని ఆమె ధీమా వ్యక్తం చేశారు. దేశంలో నేటి అభివృద్ధి.. నాటి కాంగ్రెస్‌ ప్రభుత్వం తీసుకున్న సంస్కరణల పుణ్యమే అన్నారు. 23న కేంద్రంలో కాంగ్రెస్‌ ప్రభుత్వం రాబోతుందని ఆమె స్పష్టం చేశారు.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter


Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top