గవర్నర్‌తో సీఎం జగన్‌ భేటీ

CM YS Jagan Meets Governor Narasimhan Ahead Budget Session - Sakshi

సాక్షి, విజయవాడ : బడ్జెట్‌ సమావేశాల నేపథ్యంలో వివిధ అంశాలపై చర్చించే క్రమంలో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి గవర్నర్‌ నరసింహన్‌తో భేటీ అయ్యారు. ఈ క్రమంలో సీఎం జగన్‌ నగరంలోని గేట్‌వే హోటల్‌కు చేరుకున్నారు. ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ఈ నెల 11 నుంచి ప్రారంభంకానున్న సంగతి తెలిసిందే. ఆర్థికమంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌ రెడ్డి జూలై 12న ఉదయం 11 గంటలకు సభలో తొలి బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు.

ఈ నేపథ్యంలో ప్రవేశపెట్టబోయే రాష్ట్ర బడ్జెట్‌, ఇటీవల ప్రవేశపెట్టిన కేంద్ర బడ్జెట్‌ తదితర అంశాలపై సీఎం జగన్‌ గవర్నర్‌తో చర్చించనున్నారు. ఇక మంగళవారం ముందుగానే గేట్‌వే హోటల్‌కు చేరుకున్న గవర్నర్‌ నరసింహన్‌కు ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి ఆర్పీ సిసోడియా, జిల్లా కలెక్టర్‌ ఇంతియాజ్‌ సాదర స్వాగతం పలికారు.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Taboola - Feed

Back to Top