వైఎస్సార్‌సీపీలో చేరిన సీఐ గోరంట్ల మాధవ్‌ | CI Gorantla Madhav Joins YSR Congress Party | Sakshi
Sakshi News home page

Jan 26 2019 12:25 PM | Updated on Jul 12 2019 5:45 PM

CI Gorantla Madhav Joins YSR Congress Party - Sakshi

జేసీకి సవాల్‌ విసిరిన సీఐ.. వైఎస్సార్‌సీపీలోకి

సాక్షి, హైదరాబాద్ : పోలీసు శాఖలో సీఐగా పనిచేసిన గోరంట్ల మాధవ్‌ శనివారం ప్రతిపక్షనేత, వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి సమక్షంలో పార్టీలో చేరారు. అనంతపురానికి చెందిన మాధవ్‌కు వైఎస్‌ జగన్‌ కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. సీఐ మాధవ్‌తో పాటు ఆయన ప్రాంతానికి చెందిన పలువురు పార్టీలో చేరారు. వైఎస్‌ జగన్‌ సుదీర్ఘ పాదయాత్రతో రాజకీయాలవైపు ఆకర్షితులైన ఆయన తన ఉద్యోగానికి రాజీనామా చేసి పార్టీలో చేరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీలో చేరడం చాలా సంతోషంగా ఉందన్నారు. బడుగు, బలహీన వర్గాలకు పార్టీని చేరువ చేయడానికి కృషి చేస్తానని, అనంతపురం జిల్లాలో పార్టీని బలోపేతం చేస్తానన్నారు.

కదిరి సీఐగా పనిచేసే సమయంలో పోలీసులపై అనుచిత వ్యాఖ్యలు చేసిన జేసీ దివాకర్‌ రెడ్డికి పోలీసుల పవరేంటో చూపిస్తానని గోరంట్ల మాధవ్‌ సవాల్‌ విసిరిన విషయం తెలిసిందే. తాడిపత్రిలోని ప్రభోదానంద ఆశ్రమ వివాద నేపథ్యంలో జేసీ.. పోలీసులు హిజ్రాల్లా వ్యవహరిస్తున్నారని కామెంట్‌ చేశారు. ఈ వ్యాఖ్యలకు తీవ్రంగా స్పందించిన సీఐ గోరంట్ల మాధవ్‌.. నోరు అదుపులో పెట్టుకోవాలనీ, ఇష్టమొచ్చినట్టు మాట్లాడితే నాలుక కోస్తామని హెచ్చరించారు. ‘మేము మగాళ్లం’ అంటూ మీడియా ఎదుట మీసం తిప్పారు. అప్పట్లో ఈ వ్యాఖ్యలు తీవ్ర చర్చనీయాంశమయ్యాయి. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement