ఎస్సీ వర్గీకరణపై రెండు నాల్కల ధోరణి | chada venkata reddy fired on kcr | Sakshi
Sakshi News home page

ఎస్సీ వర్గీకరణపై రెండు నాల్కల ధోరణి

Dec 23 2017 2:51 AM | Updated on Sep 15 2018 3:07 PM

chada venkata reddy fired on kcr - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ఎస్సీ వర్గీకరణపై ముఖ్యమంత్రి చం ద్రశేఖర్‌రావు రెండు నాల్కల ధోరణి అవలంబిస్తున్నారని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి విమర్శించారు. వర్గీకరణపై మాట్లాడేందుకు ఇప్పటివరకూ ప్రధాని అపాయింట్‌మెంట్‌ సీఎం తీసుకోకపోవడం సిగ్గుచేటన్నారు.

వర్గీకరణ కోసం పోరాడుతున్న ఎమ్మార్పీఎస్‌ నేత మందకృష్ణ మాదిగను వెంటనే విడుదల చేయాలని డిమాండ్‌ చేశారు. శుక్రవారం హైదరా బాద్‌లో ఆయన విలేకరులతో మాట్లాడారు. నిరుద్యోగ సమస్యను కేసీఆర్‌ గాలికొదిలేశారని, ఉద్యోగాల భర్తీపై బోగస్‌ మాటలు మాట్లాడుతున్నారని ఆరోపించారు. గ్రామాల్లో ఘర్షణలు పెంచేలా పంచాయతీరాజ్‌ చట్టంలో మార్పులు చేసేందుకు టీఆర్‌ఎస్‌ ప్రయత్నిస్తోందని విమర్శించారు. సైన్స్‌ కాంగ్రెస్‌ నిర్వహించకపోవడం ప్రభుత్వం అసమర్థతకు నిదర్శనమని విమర్శించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement