బాబుపై మరో బీజేపీ నేత సంచలన వ్యాఖ్యలు | bjp leader shocking comments | Sakshi
Sakshi News home page

బాబుపై మరో బీజేపీ నేత సంచలన వ్యాఖ్యలు

Feb 7 2018 6:52 PM | Updated on Aug 10 2018 8:46 PM

bjp leader shocking comments - Sakshi

బీజేపీ నేత కన్నా లక్ష్మీనారాయణ

గుంటూరు : టీడీపీ నాయకులపై బీజేపీ నేతల మాటల దాడి కొనసాగుతోంది. తాజాగా ఏపీ సీఎం చంద్రబాబు నాయుడిపైనే బీజేపీ నేత కన్నా లక్ష్మీనారాయణ సంచలన వ్యాఖ్యలు చేశారు. గుంటూరులో విలేకరులతో మాట్లాడుతూ.. టీడీపీ నేతలు ప్రత్యేక విమానాల్లో తిరుగుతూ వృధా ఖర్చులు చేస్తున్నారని మండిపడ్డారు. రాష్ట్రాన్ని మరింతగా అప్పులపాలు చేస్తున్నారని వ్యాఖ్యానించారు. రాజధాని కోసం కేంద్ర ప్రభుత్వం రూ. 2,500 కోట్లు ఇచ్చినా చిన్న నిర్మాణం కూడా మొదలు పెట్టలేదని విరుచుకుపడ్డారు.

 ఇచ్చిన సొమ్ముకు లెక్కా, పత్రాలు లేవని, కనీసం డీపీఆర్ ఇవ్వకుండా నిధులు ఇవ్వమంటే ఎలా ఇస్తారని ప్రశ్నించారు. సినిమా డైరెక్టర్లతో డిజైన్లు వేయించడం ఎంతవరకు సమంజసం అని ప్రశ్నించారు. ఇదివరకే బీజేపీ నేత సోము వీర్రాజు టీడీపీ అక్రమాలపై బహిరంగా విమర్శలు చేసిన సంగతి తెల్సిందే. తాజాగా కన్నా లక్ష్మీనారాయణ కూడా చేరడంతో టీడీపీ నేతలకు ఏంచేయాలో తోచడం లేదు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement