చెల్లెలి బాటలో అన్న | Bhuma Brahmananda Reddy Surrender Gunmen | Sakshi
Sakshi News home page

బ్రహ్మానంద రెడ్డి కూడా...

Jan 7 2019 1:49 PM | Updated on Jan 7 2019 1:52 PM

Bhuma Brahmananda Reddy Surrender Gunmen - Sakshi

కర్నూలు జిల్లాలో అధికార టీడీపీ నేతల అలక కొనసాగుతోంది.

సాక్షి, నంద్యాల: కర్నూలు జిల్లాలో అధికార టీడీపీ నేతల అలక కొనసాగుతోంది. తన మద్దతుదారులను పోలీసులు వేధిస్తున్నారనే ఆరోపణలతో మంత్రి భూమా అఖిలప్రియ ఇప్పటికే తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. తాజాగా ఆమె అన్నయ్య, నంద్యాల ఎమ్మెల్యే భూమా బ్రహ్మానంద రెడ్డి కూడా ఇదే వైఖరి ప్రదర్శించారు. తనకు ప్రభుత్వం కల్పించిన భద్రతను వద్దన్నారు. గన్‌మెన్‌లను తిప్పి పంపించారు. తన చెల్లెలికి లేని భద్రత తనకు అవసరం లేదని స్పష్టం చేశారు. వ్యక్తిగత సిబ్బంది, గన్‌మెన్‌లు లేకుండానే సోమవారం జన్మభూమి కార్యక్రమంలో పాల్గొంటున్నారు.

తన వర్గీయుల ఇళ్లపై పోలీసులు ఆకస్మిక దాడులు చేయడాన్ని నిరసిస్తూ అఖిలప్రియ గురువారం గన్‌మెన్‌లను తిప్పిపంపారు. అధికార పార్టీ నేతల అసంతృప్తి ఏపీ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. వీరి వ్యవహారశైలిపై ప్రజలు మండిపడుతున్నారు. మంత్రి, ఎమ్మెల్యే మద్దతుదారులు అరాచకాలు చేస్తే చూస్తూ ఊరుకోవాలా అని ప్రశ్నిస్తున్నారు. (అఖిలప్రియ సంచలన వ్యాఖ్యలు)

Advertisement
 
Advertisement
Advertisement