మోదీ అన్యాయం చేశారు

Ache din' now replaced with 'chowkidar chor hai - Sakshi

ఎన్నికల సభల్లో రాహుల్‌

జలోర్‌/అజ్మీర్‌/కోట: ప్రధాని మోదీ గత ఐదేళ్లలో దేశ ప్రజలకు అన్యాయం చేశారని కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌ విమర్శించారు. ‘అచ్ఛే దిన్‌ ఆయేంగే’అన్న నినాదం పోయి దాని స్థానంలో ‘చౌకీదార్‌ చోర్‌ హై’ వచ్చిందన్నారు. అందరికీ న్యాయం ఒకే ఒక్క ‘హిందుస్తాన్‌’ ఉండాలని, కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చినప్పుడే న్యాయం జరుగుతుందని చెప్పారు. గురువారం రాజస్తాన్‌లోని జలోర్, అజ్మీర్, కోటలో జరిగిన ఎన్నికల ర్యాలీల్లో రాహుల్‌ ప్రసంగించారు. హిందుస్తాన్‌లో అన్యాయమనేదే ఉండకూడదని, దేశం రెండు హిందుస్తాన్లుగా విభజింపబడకూడదని అన్నారు.

గత ఐదేళ్లలో ప్రజలు ‘మన్‌ కీ బాత్‌’విన్నారని, కానీ ‘న్యాయ్‌’పథకానికి రూపకల్పన చేయడం ద్వారా కాంగ్రెస్‌ మేధావి వర్గం ‘కామ్‌ కీ బాత్‌’చేసిందని అన్నారు. మోదీజీ తెరిపించిన బ్యాంకు ఖాతాల్లోనే ‘న్యాయ్‌’పథకానికి సంబంధించిన డబ్బులు వేయాలనుకుంటున్నాననిæ చెప్పారు. ఆయా కుటుంబాల మహిళల ఖాతాల్లో నేరుగా డబ్బు జమ చేయడం జరుగుతుందన్నారు. కాంగ్రెస్‌ పార్టీ ప్రజల ‘మన్‌కీ బాత్‌’(మనసులోని మాట)ను వింటుందని, ఆ మేరకు నడుచుకుంటుందని పేర్కొన్నారు. కాంగ్రెస్‌ అధికారంలోకొస్తే ఒక్క ఏడాదిలోనే 22 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేస్తుందని చెప్పారు.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top