ఆధార్‌ బిల్లులో పారదర్శకత లేదు

Aadhar Bill Lacks Transparency Said By Mahua Moitra TMC Mp - Sakshi

కొల్‌కతా: ఆధార్‌ సవరణ బిల్లు- 2016 పారదర్శకత లేకుండ ఉందని.. సుప్రీం కోర్టును సైతం తప్పుదోవ పట్టిస్తోందని టీఎంసీ ఎంపీ మహువా మైత్రా లోక్‌ సభలో ఆరోపించారు. ఈ బిల్లుపై మరింత పారదర్శకత చూపించే దిశగా సభలో చర్చ జరగాలని ఆమె డిమాండ్‌ చేశారు. ఆధార్‌.. దేశ ప్రజల వ్యక్తిగత సమాచారం, వివరాలకు సంబంధించిన సున్నితమైన బిల్లు అని పేర్కొన్నారు. సవరణలో భాగంగా రూపొందిస్తున్న కొత్త ఆధార్‌ చట్టంలో మూడు క్లాజ్‌లు ప్రజల వ్యక్తిగత గోప్యతకు విఘాతం కలిగించేలా ఉన్నాయని ఆమె ఆందోళన వ్యక్తం చేశారు. ఆధార్‌ పేద ప్రజల సేవలకు సౌకర్యంగా ఉండాలి.. కానీ వారి వ్యక్తిగత సమాచారం ఇచ్చేదిగా ఉండకూడదని చేప్పారు.

కొత్తగా ఆధార్‌ బిల్లు ప్రైవేటు సంస్థలకు ప్రజల సమాచారాన్ని అప్పనంగా అందించే విధంగా ఉందన్నారు. బ్యాంక్‌ సేవలకు ఆధార్‌ వివరాలు ఇచ్చినప్పటికీ, టెలికాం సేవలకు ఇవ్వడం వల్ల ఉపయోగం ఏంటని ఆమె ప్రశ్నించారు. ప్రైవేట్‌ సేవలకు ఆధార్‌ బయోమెట్రిక్‌ ఇవ్వడం వల్ల ప్రజలకు ఉపయోగం ఉండకపోగా వారి సమాచారాన్ని ఇతరలు చోరిచేసే అవకాశం ఉందని అన్నారు.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top