నమ్మకాలు | spritual.. Faiths | Sakshi
Sakshi News home page

నమ్మకాలు

Feb 7 2015 12:56 AM | Updated on Sep 2 2017 8:54 PM

నమ్మకాలు

నమ్మకాలు

సిక్కు మతస్తుల చివరి గురువు గురునానక్ జీవిత కాలంలో ఒకసారి హరిద్వార్‌లో ఉన్నాడట.

సిక్కు మతస్తుల చివరి గురువు గురునానక్ జీవిత కాలంలో ఒకసారి హరిద్వార్‌లో ఉన్నాడట. హిందూ మతస్తులు అన్నంతో పిండాలు తయారుచేసి, తమ పితృదేవతలకు సమర్పిస్తున్నారు. హిందువుల నమ్మక మేమిటంటే, తాము పిండప్రదానం చేసి, వాటిని ఆరు బయట ఆకుల్లో పెడితే, కాకుల రూపంలో తమ పితృ దేవతలు వచ్చి వాటిని స్వీకరిస్తారని. వందలాది కాకు లు ఆ విధంగా వచ్చి ఆ పిండాలను తిన్నాయి.
 
 గురునానక్ ఈ దృశ్యాన్ని చూసి, ‘మరణించిన పూర్వీకులు వచ్చి ఇప్పుడీ ఆహారాన్ని కాకుల రూపం లో స్వీకరిస్తున్నారనే వీరి విశ్వాసం అసాధారణంగా ఉంది’ అని అనుకున్నాడు.
 
 అక్కడే ఉన్న ఓ బావి దగ్గర నీళ్లు చేదుకొని భక్తు లు స్నానాలు చేస్తున్నారు. వారి తరఫున వచ్చిన పూజా రి మంత్రాలు పఠిస్తున్నాడు. కాకులు తింటున్నాయి.
 
 నానక్ కూడా స్నానం చేశాడు. శుచిగా నిలబడి, బావిలో నుండి బక్కెట్లతో నీళ్లు తోడి బజారులో పార బోయడం ప్రారంభించాడు. ‘‘ఎందుకిలా నీళ్లు తోడి పోస్తున్నారని?’’ అక్కడి వారు అడిగారు. ‘‘పంజాబ్‌లో ఉన్న నా పొలాలకు నీరు అందిస్తున్నాను’’ అని సమాధా నం చెప్పాడు. ‘‘ఈ పూజారులు చెప్తున్న కొన్ని మం త్రాలు గనక కాలాన్ని అతిక్రమించి, వందల ఏళ్ల క్రింద గతించిన వారికి ఆహారం అందిస్తున్నాయికదా! నా పంజాబ్‌లో పొలాలు కొన్ని వందల మైళ్ల దూరంలోనే ఉన్నాయి. నేనక్క డికి ఇప్పుడు వెళ్లగలిగి లేను కాబట్టి, ఇక్కడ నుండే అక్కడికి నీళ్లు అందిస్తున్నాను’’ అన్నాడు.
 
 ‘‘ఇదేదో పిచ్చిగా ఉంది. ఇక్కడ పోసే నీళ్లు, వం దల మైళ్ల అవతలనున్న మీ పొలాలకు అందడం అనేది వెర్రి ఆలోచన’’ అన్నారు వారు.
 
 ‘‘ఇక్కడ, ఈ కాకులు తింటున్న అన్నం ఎప్పుడో గతించిన వీరి పూర్వీకుల ఆకలి తీరుస్తున్నదంటే, మరి నా నమ్మకం వ్యర్థమైనదా?’’ అన్నాడు గురునానక్.
 
 ఇలా చూస్తే, ప్రతి జాతిలోనూ ప్రతి దేశంలోనూ నమ్మకాలు కోకొల్లలు. గుడ్లగూబలు, గబ్బిలాలు ఇంటి మీదగుండా ఎగురుతూ పోతే కీడు జరుగుతుందని కొందరు నమ్ముతారు. అయితే తెల్ల గుడ్లగూబ; లక్ష్మీ దేవత వాహనమనీ, అందువల్ల అది తారసిల్లితే తమ కు భాగ్యం ఒనగూరుతుందని కేరళీయులు నమ్ముతా రు. కొన్ని రకాల తాబేళ్లను ఒకరికొకరు బహుమతిగా ఇవ్వడానికి కారణం, దానివల్ల అదృష్టం కలసి వస్తుం దని. నల్ల పిల్లి కనిపించడం అదృష్ట సూచకమని కొన్ని దేశాల్లో నమ్మితే, కీడు సంభవిస్తుందని కొన్ని దేశాల్లో శంకిస్తారు.
 
 వివేకానందుడు అంధవిశ్వాసాన్ని తిరస్కరించా డు కానీ, ‘‘హిందూమతం కొన్ని నమ్మకాలను తెలియ జేసిందంటే అందులో ఏ కొద్ది సత్యమో ఉండనే ఉం టుంది’’ అని కూడా అన్నాడు. విశ్వాసం వారి వారి ఆధ్యాత్మిక స్వానుభవం మీద ఆధారపడి ఉంటే మేలు.
 
 నీలంరాజు లక్ష్మీప్రసాద్
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement