
గ్రహం అనుగ్రహం, ఆగస్టు, 19, 2015
శ్రీ మన్మథనామ సంవత్సరం, దక్షిణాయనం, వర్ష ఋతువు, శ్రావణ మాసం
శ్రీ మన్మథనామ సంవత్సరం, దక్షిణాయనం, వర్ష ఋతువు, శ్రావణ మాసం
తిథి శు.పంచమి తె.4.26 వరకు (తెల్లవారితే గురువారం), నక్షత్రం హస్త ప.11.18 వరకు, తదుపరి చిత్త, వర్జ్యం రా.8.07 నుంచి 9.54 వరకు, దుర్ముహూర్తం ప.11.41 నుంచి 12.31వరకు, అమృతఘడియలు ఉ.4.49 నుంచి 6.05 వరకు
సూర్యోదయం : 5.46
సూర్యాస్తమయం : 6.21
రాహుకాలం:
ప.12.00 నుంచి
1.30 వరకు
యమగండం:
ఉ.7.30 నుంచి
9.00 వరకు
భవిష్యం
మేషం: పరిస్థితులు అనుకూలిస్తాయి. సంఘంలో విశేష ఆదరణ లభిస్తుంది. అప్రయత్న కార్యసిద్ధి కలుగుతుంది. ఆహ్వానాలు రాగలవు. వస్తు లాభాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో నూతనోత్సాహం నెలకొంటుంది.
వృషభం: వ్యవహారాలలో స్వల్ప ఆటంకాలు. ధనవ్యయం. బంధువులతో మాటపట్టింపులు. ఆరోగ్య సమస్యలు. దూరప్రయాణాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో నిరుత్సాహం.
మిథునం: బంధువుల నుంచి ఒత్తిడులు. అనుకోని ప్రయాణాలు చేసే అవకాశం ఉంది. ఇంటా బయటా చికాకులు పెరుగుతాయి. ఆలయ దర్శనాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఒడిదుడుకులు నెలకొంటాయి.
కర్కాటకం: కొత్త వ్యక్తులు పరిచయం అవుతారు. శుభవార్తలు అందుతాయి. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. సన్నిహితుల నుంచి సహాయం అందుకుంటారు. వాహన యోగం. వ్యాపారాలు, ఉద్యోగాలలో అనుకూలత.
సింహం: మిత్రులతో వివాదాలు రావచ్చు. ఆలోచనలు కలసి రావు. ఇంటా బయటా బాధ్యతలు పెరుగుతాయి. అనారోగ్యం. వ్యాపారాలు సామాన్యంగా ఉంటాయి. ఉద్యోగులకు పనిభారం పెరుగుతుంది.
కన్య: ఆసక్తికరమైన సమాచారం అందుతుంది. విందు వినోదాలు. పనుల్లో విజయం సాధిస్తారు. ఆప్తుల సలహాలు స్వీకరిస్తారు. ఆహ్వానాలు అందుతాయి. వ్యాపారాలు, ఉద్యోగాలలో ప్రోత్సాహంతో ముందుకెళతారు.
తుల: బంధువులతో విభేదాలు. శ్రమ పడ్డా ఫలితం కనిపించదు. ఆస్తి వివాదాలు. అర్థిక ఇబ్బందులు. పనులు వాయిదా వేస్తారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో నిరుత్సాహం.
వృశ్చికం: పనుల్లో విజయం సాధిస్తారు. శుభకార్యాలలో పాల్గొంటారు. పాతమిత్రులను కలుసుకుంటారు. ప్రముఖులతో పరిచయాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో నూతనోత్సాహం.
ధనుస్సు: దూరప్రాంతాల నుంచి ముఖ్య సమాచారమందుతుంది. భూ లాభాలు. పనులు సకాలంలో పూర్తిచేస్తారు. ఆలయ దర్శనాలు. వ్యాపారాలు, ఉద్యోగాల్లో అనుకూలత.
మకరం: చేపట్టిన పనులు ముందుకు సాగవు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. అనారోగ్యం. శ్రమాధిక్యం. విద్యార్థుల యత్నాలలో ఆటంకాలు కలుగుతాయి. వ్యాపారాలు, ఉద్యోగాలు నిరాశ పరుస్తాయి.
కుంభం: వ్యయప్రయాసలు. పనుల్లో ఆటంకాలు. బంధువులతో విభేదాలు. శ్రమపడ్డా ఫలితం ఉండదు. వ్యాపారాలు మందకొడిగా సాగుతాయి. ఉద్యోగులకు పనిభారం.
మీనం: కొత్త విషయాలు తెలుసుకుంటారు. ప్రతిభ వెలుగులోకి వస్తుంది. అర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. మిత్రులతో ఆనందంగా గడుపుతారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో అనుకూలంగా ఉంటుంది.
- సింహంభట్ల సుబ్బారావు