
గ్రహం అనుగ్రహం, మార్చి 26, 2016
శ్రీ మన్మథనామ సంవత్సరం, ఉత్తరాయణం, శిశిర ఋతువు, ఫాల్గుణమాసం
శ్రీ మన్మథనామ సంవత్సరం
ఉత్తరాయణం, శిశిర ఋతువు
ఫాల్గుణమాసం
తిథి బ.తదియ రా.10.10 వరకు
నక్షత్రం స్వాతి రా.1.32 వరకు
వర్జ్యం ఉ.5.16 నుంచి 7.04 వరకు
దుర్ముహూర్తం ఉ.6.04 నుంచి 7.37 వరకు
అమృతఘడియలు ప.3.57 నుంచి 5.44 వరకు
భవిష్యం
మేషం: పనులు సకాలంలో పూర్తి చేస్తారు. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. సన్నిహితుల నుంచి సహాయం అందుంతుంది. ఆలయ దర్శనాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో పురోగతి సాధిస్తారు.
వృషభం: కొత్త వ్యక్తులు పరిచయమవుతారు. శుభవార్తలు. ఆర్థిక వ్యవహారాలు ఆశాజనకంగా ఉంటాయి. ఆకస్మిక ధన, వస్తులాభాలు. వ్యాపారవృద్ధి. ఉద్యోగులకు హోదాలు.
మిథునం: పనుల్లో జాప్యం. ఆర్థిక ఇబ్బందులు. రుణయత్నాలు. ఆకస్మిక ప్రయాణాలు. ఇంటాబయటా సమస్యలు. అనారోగ్యం. వ్యాపారాలు, ఉద్యోగాలలో నిరుత్సాహం.
కర్కాటకం: శ్రమ పెరుగుతుంది. పనుల్లో అవాంతరాలు. వృథా ఖర్చులు. కొత్త బాధ్యతలు. దూర ప్రయాణాలు చేస్తారు. కుటుంబసభ్యులతో కలహాలు. వ్యాపార, ఉద్యోగాలు మందగిస్తాయి.
సింహం: కొత్త కార్యక్రమాలు చేపడతారు. ఆత్మీయుల నుంచి పిలుపురావచ్చు. ఆకస్మిక ధన లాభం. సోదరులతో ఆనందంగా గడుపుతారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో అనుకూల పరిస్థితి.
కన్య: దూరప్రయాణాలు చేస్తారు. సోదరులు, మిత్రులతో మాటపట్టింపులు వచ్చే అవకాశం ఉంది. వ్యయ ప్రయాసలు. ఖర్చులు పెరుగుతాయి. వ్యాపారాలు, ఉద్యోగాలలో చికాకులు పెరుగుతాయి.
తుల: పరిచయాలు పెరుగుతాయి. ఆస్తి వివాదాల పరిష్కారం. శుభవార్తలు వింటారు. ప్రముఖుల నుంచి ఆహ్వానాలు. వ్యాపారాలు విస్తరిస్తారు. ఉద్యోగులకు పదోన్నతులు.
వృశ్చికం: శ్రమాధిక్యం. కొన్ని కార్యక్రమాలు వాయిదా వేస్తారు. ఆలోచనలు కలసిరావు. కుటుంబసభ్యులతో వైరం. అనారోగ్యం. వ్యాపారాలు, ఉద్యోగాలు సామాన్యంగా ఉంటాయి.
ధనుస్సు: కుటుంబంలో శుభకార్యాలు. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. సన్నిహితులతో సఖ్యత. వస్తులాభాలు. ఆహ్వానాలు అందుతాయి. వ్యాపారాలు, ఉద్యోగాలు ఉత్సాహవంతంగా సాగుతాయి.
మకరం: నూతన ఉద్యోగప్రాప్తి కలుగుతుంది. సంఘంలో గౌరవం లభిస్తుంది. వస్తులాభాలు. చిన్ననాటి మిత్రుల కలయిక. ఆలయ దర్శనాలు. వ్యాపారాలు నిరాశాజనకంగా ఉంటాయి. ఉద్యోగులకు మార్పులు చోటుచేసుకుంటాయి.
కుంభం: చేపట్టిన కార్యక్రమాలలో అవాంతరాలు. వృథా ఖర్చులు. సోదరులతో విభేదాలు. శ్రమ పెరుగుతుంది. ధనవ్యయం. వ్యాపారాలు, ఉద్యోగాలలో చికాకులు.
మీనం: వ్యయప్రయాసలు. బంధువర్గంతో మాటపట్టింపులు. అనారోగ్యం. కుటుంబంలో చికాకులు. ఆకస్మిక ప్రయాణాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఒడిదుడుకులు.
- సింహంభట్ల సుబ్బారావు