గ్రహం అనుగ్రహం 18 మార్చి 2016, శుక్రవారం | graham anugraham for the day of march 18th 2016 | Sakshi
Sakshi News home page

గ్రహం అనుగ్రహం 18 మార్చి 2016, శుక్రవారం

Mar 18 2016 1:09 AM | Updated on Aug 21 2018 12:03 PM

గ్రహం అనుగ్రహం 18 మార్చి 2016, శుక్రవారం - Sakshi

గ్రహం అనుగ్రహం 18 మార్చి 2016, శుక్రవారం

శ్రీ మన్మథనామ సంవత్సరం, ఉత్తరాయణం,

శ్రీ మన్మథనామ సంవత్సరం, ఉత్తరాయణం, శిశిర ఋతువు, ఫాల్గుణమాసం
తిథి శు.దశమి ప.1.01 వరకు, తదుపరి ఏకాదశి,
నక్షత్రం పునర్వసు ప.11.50 వరకు, తదుపరి పుష్యమి,
వర్జ్యం రా.7.55-9.33 వరకు,
దుర్ముహూర్తం ఉ.8.33-9.22 వరకు,
తదుపరి ప.12.32-1.22 వరకు,
అమృతఘడియలు ఉ.9.25 నుంచి 11.04 వరకు

 సూర్యోదయం    :    6.10
సూర్యాస్తమయం    :    6.06
 రాహుకాలం:          ఉ.10.30 నుంచి 12.00 వరకు
 యమగండం:         ప.3.00 నుంచి 4.30 వరకు

భవిష్యం

 మేషం: ముఖ్యమైన కార్యక్రమాలు మధ్యలో విరమిస్తారు. ఆకస్మిక ప్రయాణాలు. కుటుంబ, ఆరోగ్య సమస్యలు. మిత్రులతో మాట పట్టింపులు. దైవదర్శనాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో నిరుత్సాహం నెలకొంటుంది.

 వృషభం: కుటుంబంలో శుభకార్యాలు జరిగే అవకాశం ఉంది. ఆర్థిక ప్రగతి. వస్తులాభాలు. చిన్ననాటి మిత్రుల నుంచి శుభవార్తలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో అనుకూలత.

 మిథునం:  పనుల్లో అవాంతరాలు. వృథా ఖర్చులు. దూర ప్రయాణాలు. ఆలయాలు సందర్శిస్తారు. శ్రమ పడ్డా ఫలితం కనిపించదు. వ్యాపారాలు, ఉద్యోగాలలో చికాకులు.

 కర్కాటకం: శుభవార్తలు. ఆర్థికలావాదేవీలు ఆశించిన విధంగా ఉంటాయి. వస్తులాభాలు. చిన్ననాటి మిత్రుల కలయిక. విందువినోదాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో నూతనోత్సాహం.

 సింహం: ప్రయాణాలలో మార్పులు ఉండే అవకాశం ఉంది. అనుకోని ఖర్చులు. రాబడి తగ్గుతుంది. దైవచింతన. వ్యాపారాలు మంద కొడిగా సాగుతాయి. ఉద్యోగులకు పనిభారం.

 కన్య: కొత్త విషయాలు తెలుసుకుంటారు. ప్రముఖులతో పరిచయాలు. సంఘంలో గౌరవం. ఆస్తి వివాదాలు పరిష్కారమవుతాయి. వ్యాపారాలలో లాభాలు. ఉద్యోగులకు పదోన్నతులు దక్కుతాయి.

 తుల: నూతన ఉద్యోగాలు దక్కుతాయి. సోదరులతో సఖ్యత. పాతబాకీలు సైతం వసూలవుతాయి. ఆస్తి వివాదాల పరిష్కారం. వ్యాపారాలు, ఉద్యోగాలలో అనుకూల పరిస్థితి.

 వృశ్చికం: ఆర్థిక ఇబ్బందులు. రుణాలు చేస్తారు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. కుటుంబ బాధ్యతలు పెరుగుతాయి. వ్యాపారాలు మందగిస్తాయి. ఉద్యోగులకు బాధ్యతలు పెరుగుతాయి.

 ధనుస్సు: కొత్త వ్యక్తులు పరిచయమవుతారు. శుభవార్తలు వింటారు. సమస్యలు కొన్ని పరిష్కారమవుతాయి. ఆస్తిలాభం. వ్యాపారాలు, ఉద్యోగాలలో పురోగతి సాధిస్తారు.

 మకరం: కొత్త వ్యక్తుల పరిచయం. శుభవార్తలు అందుకుంటారు. ఆర్థికాభివృద్ధి. చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు. విందువినోదాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో ప్రోత్సాహం.

 కుంభం: ప్రముఖుల నుంచి కీలక సమాచారం అందుతుంది. పనుల్లో విజయం సాధిస్తారు. ఆస్తి ఒప్పందాలు జరుగుతాయి. బాకీలు వసూలు అవుతాయి. వ్యాపారాలు, ఉద్యోగాలలో సమస్యలు తీరతాయి.

 మీనం: ఆర్థిక ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంది. రుణాలు చేస్తారు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. కుటుంబంలో చికాకులు. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఒడిదుడుకులు ఎదురవుతాయి.

 - సింహంభట్ల సుబ్బారావు

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement