
గ్రహం అనుగ్రహం, డిసెంబర్ 10, 2015
శ్రీ మన్మథనామ సంవత్సరం,దక్షిణాయనం, శరదృతువు,కార్తీక మాసం,
శ్రీ మన్మథనామ సంవత్సరం
దక్షిణాయనం, శరదృతువు
కార్తీక మాసం, తిథి బ.చతుర్దశి ప.2.40 వరకు
తదుపరి అమావాస్య
నక్షత్రం అనూరాధ రా.12.30 వరకు
వర్జ్యం ..లేదు
దుర్ముహూర్తం ఉ.10.10 నుంచి 11.01 వరకు
తదుపరి ప.2.33 నుంచి 3.26 వరకు
అమృతఘడియలు ప.1.31 నుంచి 3.12 వరకు
సూర్యోదయం : 6.23
సూర్యాస్తమయం : 5.22
రాహుకాలం: ప.1.30 నుంచి 3.00 వరకు
యమగండం: ఉ.6.00 నుంచి 7.30 వరకు
భవిష్యం
మేషం: ఆకస్మిక ప్రయాణాలు చేయవచ్చు. ఇంటాబయటా ఒత్తిడులు. అనుకోని ఖర్చులు. బంధువులతో విభేదాలు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. వ్యాపారాలు, ఉద్యోగాలలో చికాకులు.
వృషభం: కొన్ని పనులు సజావుగా సాగుతాయి. పలుకుబడి పెరుగుతుంది. అనుకోని ఆహ్వానాలు. ఇంటిలో శుభకార్యాలు. ఆర్థికాభివృద్ధి. వ్యాపారాలు, ఉద్యోగాలలో ప్రోత్సాహకరంగా ఉంటుంది.
మిథునం: సన్నిహితుల నుంచి శుభవార్తలు. ఆకస్మిక ధనలాభం. స్థిరాస్తి వివాదాల పరిష్కారం. వాహనయోగం. సోదరుల కలయిక. వ్యాపారాలు, ఉద్యోగాలలో నూతనోత్సాహం.
కర్కాటకం: ఆర్థిక ఇబ్బందులు. దూర ప్రయాణాలు. కుటుంబంలో చికాకులు. ఆధ్యాత్మిక చింతన. అనారోగ్యం. పనుల్లో ఆటంకాలు.వ్యాపార, ఉద్యోగాల్లో నిరుత్సాహం.
సింహం: ఆదాయానికి మించి ఖర్చులు. కొత్త బాధ్యతలు చేపడతారు. శ్రమ తప్ప ఫలితం కనిపించదు. ఆస్తి వివాదాలు. దైవదర్శనాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో మార్పులు తప్పదు.
కన్య: చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు. ప్రతిభాపాటవాలు వెలుగులోకి వస్తాయి. ఆశ్చర్యకరమైన విషయాలు తెలుస్తాయి. వ్యాపారాల్లో పురోగతి సాధిస్తారు. ఉద్యోగులకు పదోన్నతులు దక్కుతాయి.
తుల: మిత్రులతో విభేదాలు వచ్చే అవకాశం ఉంది. ఆర్థిక ఇబ్బందులు. దూర ప్రయాణాలు. అనారోగ్యం. కుటుంబంలో ఒత్తిడులు పెరుగుతాయి. ఆలయాలు సందర్శిస్తారు. వ్యాపార, ఉద్యోగాలలో నిరాశ ఎదురవుతుంది.
వృశ్చికం: బంధువులతో ఆనందంగా గడుపుతారు. సేవలకు గుర్తింపు రాగలదు. ఆర్థిక అభివృద్ధి కలుగుతుంది. ముఖ్య నిర్ణయాలు తీసుకుంటారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో నూతనోత్సాహం నెలకొంటుంది.
ధనుస్సు: వ్యవహారాలలో ఆటంకాలు. వృథా ఖర్చులు. ప్రయాణాలలో మార్పులుంటాయి ఆరోగ్య సమస్యలు. పుణ్యక్షేత్రాల సందర్శన. వ్యాపారాలు, ఉద్యోగాలలో చికాకులు.
మకరం: ఇంటా బయటా ప్రోత్సాహం అందుతుంది. ఆకస్మిక ధన లాభం. ఉద్యోగ యత్నాలు కలసివస్తాయి. దైవదర్శనాలు. విందు వినోదాలు. వ్యాపారాలు లాభిస్తాయి. ఉద్యోగులకు కొత్త హోదాలు దక్కుతాయి.
కుంభం: పనులలో విజయం సాధిస్తారు. శుభకార్యాలలో పాల్గొంటారు. బాకీలు వసూలవుతాయి. అంచనాలు నిజమవుతాయి. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. ఉద్యోగులకు ఉత్సాహవంతంగా ఉంటుంది.
మీనం: పనుల్లో ఆటంకాలు కలగవచ్చు. దుబారా ఖర్చులు చేస్తారు. కొత్త బాధ్యతలు. ఆకస్మిక ప్రయాణాలు. కుటుంబ సమస్యలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో నిరుత్సాహం.
- సింహంభట్ల సుబ్బారావు