
గ్రహం అనుగ్రహం (29.08.2015)
గ్రహం అనుగ్రహం
గ్రహం అనుగ్రహం
శ్రీ మన్మథనామ సంవత్సరం, దక్షిణాయనం, వర్ష ఋతువు, శ్రావణ మాసం తిథి పౌర్ణమి రా.1.01 వరకు, నక్షత్రం... ధనిష్ఠ సా.4.51 వరకు, తదుపరి శతభిషం, వర్జ్యం రా.11.35 నుంచి 1.06 వరకు, దుర్ముహూర్తం ఉ.5.47 నుంచి 7.27 వరకు, అమృతఘడియలు ఉ.8.01 నుంచి 9.30 వరకు
సూర్యోదయం : 5.48
సూర్యాస్తమయం : 6.14
రాహుకాలం: ఉ.9.00 నుంచి 10.30 వరకు
యమగండం: ప.1.30 నుంచి 3.00 వరకు
రాఖీ, జంధ్యాల పౌర్ణమి.
భవిష్యం
మేషం: కొత్త విషయాలు తెలుసుకుంటారు. ప్రతిభ వెలుగులోకి వస్తుంది. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. సన్నిహితుల నుంచి శుభవార్తలు అందుతాయి. వ్యాపారాలు, ఉద్యోగాలలో నూతనోత్సాహం.
వృషభం: ఇంటర్వ్యూలు అందుతాయి. వ్యవహారాలలో విజయం సాధిస్తారు. విద్యార్థులకు అనుకూలంగా ఉంటుంది. సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో పురోగతి సాధిస్తారు.
మిథునం: మిత్రులతో వివాదాలు. ఆర్థిక ఇబ్బందులు. దూర ప్రయాణాలు చేస్తారు. ఇంటా బయటా ఒత్తిడులు పెరుగుతాయి. శ్రమాధిక్యం. దైవ దర్శనాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు నిరాశ పరుస్తాయి.
కర్కాటకం: వ్యవహారాలలో ఆటంకాలు కలిగే అవకాశం ఉంది. అనుకోని ధన వ్యయం. కుటుంబసభ్యులతో స్వల్ప వివాదాలు రావచ్చు. అనారోగ్యం. వ్యాపారాలు, ఉద్యోగాలు మందకొడిగా సాగుతాయి.
సింహం: దూరపు బంధువులను కలుసుకుంటారు. విందు వినోదాలు. చేపట్టిన పనులు సకాలంలో పూర్తిచేస్తారు. అరుదైన సన్మానాలు జరుగుతాయి. వ్యాపారాలు, ఉద్యోగాలు ఆశాజనకంగా ఉంటాయి.
కన్య: ఒక సమాచారం విద్యార్థులకు ఉత్సాహాన్నిస్తుంది. వ్యవహారాలలో విజయం సాధిస్తారు. శుభకార్యాలలో పాల్గొంటారు. బాకీలు వసూలవుతాయి. వ్యాపారాలు, ఉద్యోగాలలో చికాకులు తొలగుతాయి.
తుల: మిత్రులతో విభేదాలు రావచ్చు. ధన వ్యయం. అనారోగ్యం. కుటుంబంలో ఒత్తిడులు పెరిగే అవకాశం ఉంది. ఆలయాలను సందర్శిస్తారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఒడిదుడుకులు ఎదురవుతాయి.
వృశ్చికం: బంధువుల నుంచి ఒత్తిడులు పెరుగుతాయి. అనుకోని ప్రయాణాలు. కుటుంబంలో కొద్దిపాటి చికాకులు. ఆరోగ్య భంగం. వ్యాపార, ఉద్యోగాలు నిరాశ కలిగిస్తాయి.
ధనుస్సు: ఇంటిలో శుభకార్యాలు జరిగే అవకాశం ఉంది. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. సన్నిహితుల నుంచి ధన లాభం. భూ వివాదాలు పరిష్కారమవుతాయి. వ్యాపారాలు, ఉద్యోగాలలో ప్రోత్సాహం నెలకొంటుంది.
మకరం: కుటుంబ సమస్యలు చికాకు పరుస్తాయి. ధనవ్యయం. శ్రమాధిక్యం. దైవ దర్శనాలు చేసుకుంటారు. వ్యాపార, ఉద్యోగాలు నిరాశపరుస్తాయి. అనుకోని ప్రయాణాలు.
కుంభం: శుభకార్యాలలో పాల్గొంటారు. పాత మిత్రులను కలుసుకుంటారు. విందు వినోదాలు. వాహన యోగం. వ్యాపారాలు, ఉద్యోగాలు సంతృప్తినిస్తాయి. సన్మాన, సత్కారాలు.
మీనం: బంధువులతో మాటపట్టింపులు వస్తాయి. ధన వ్యయం. శ్రమ పడ్డా ఫలితం కనిపించదు. ఆస్తి వివాదాలు. అనారోగ్యం. వ్యాపారాలు, ఉద్యోగాలలో నిరుత్సాహం నెలకొంటుంది.
- సింహంభట్ల సుబ్బారావు