శ్రీ చాంద్రమాన మన్మథనామ సంవత్సరం.
శ్రీ చాంద్రమాన మన్మథనామ సంవత్సరం
దక్షిణాయనం, గ్రీష్మ ఋతువు
నిజ ఆషాఢ మాసం
తిథి శు.సప్తమి సా. 4.38 వరకు
తదుపరి అష్టమి, నక్షత్రం చిత్త పూర్తి
వర్జ్యం ప.12.43 నుంచి 2.30 వరకు
దుర్ముహూర్తం ఉ.9.57 నుంచి 10.47 వరకు
తదుపరి ప.3.09 నుంచి 3.58 వరకు
అమృతఘడియలు రా.11.14 నుంచి 1.02 వరకు.
సూర్యోదయం: 5.39
సూర్యాస్తమయం: 6.33
రాహుకాలం: ప.1.30 నుంచి 3.00 వరకు
యమగండం: ఉ.6.00 నుంచి 7.30 వరకు.
భవిష్యం
మేషం: ధన, వస్తులాభాలు. కార్యజయం కలుగుతుంది. శుభవార్తలు అందుకుంటారు. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. వ్యవహారాల్లో విజయం సాధిస్తారు. వ్యాపారాలు, ఉద్యోగాలు ఆశాజనకంగా ఉంటాయి.
వృషభం: కొన్ని కార్యక్రమాలు వాయిదా వేస్తారు. ఆలోచనలు నిలకడగా ఉండవు. బాధ్యతలు పెరుగుతాయి. వ్యాపారాలు, ఉద్యోగాలు నిరాశపరుస్తాయి.
మిథునం: శ్రమ తప్పదు. పనుల్లో జాప్యం జరగవచ్చు. ఆరోగ్య, కుటుంబ సమస్యలు. కొన్ని వ్యవహారాలు వాయిదా వేస్తారు. వ్యాపారాలలో నిరుత్సాహం. ఉద్యోగులకు పనిభారం పెరుగుతుంది.
కర్కాటకం: కొత్త విషయాలు తెలుసుకుంటారు. పరిస్థితులు అనుకూలిస్తాయి. పనులు విజయవంతంగా సాగుతాయి. వ్యాపారాలు, ఉద్యోగాలలో పురోగతి సాధిస్తారు.
సింహం: కొన్ని పనులు వాయిదా వేస్తారు. పాత మిత్రులను కలుసుకుంటారు. శ్రమాధిక్యం. దైవదర్శనాలు చేసుకుంటారు. బంధువులను కలుసుకుంటారు. వ్యాపారాలు, ఉద్యోగాలు గందరగోళంగా ఉంటాయి.
కన్య: దూరప్రాంతాల నుంచి కీలక సమాచారం అందుకుంటారు. విందు వినోదాలు. ఆస్తి లాభం. ఉద్యోగ యత్నాలు అనుకూలిస్తాయి. వ్యాపారాలు, ఉద్యోగాలలో ప్రోత్సాహం.
తుల: వ్యయప్రయాసలు. ధన వ్యయం. కుటుంబంలో కొద్దిపాటి చికాకులు పెరగవచ్చు. ఆలయాలను సందర్శిస్తారు. అనారోగ్యం. వ్యాపారాలు, ఉద్యోగాలు నిరాశ పరుస్తాయి.
వృశ్చికం: నూతన వ్యక్తులు పరిచయమవుతారు. శుభకార్యాలకు హాజరు అవుతారు. పనుల్లో విజయం సాధిస్తారు. చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో లక్ష్యాలు సాధిస్తారు.
ధనుస్సు: నిరుద్యోగులకు శుభవార్తలు అందుతాయి. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. సన్నిహితుల సాయం అందుతుంది. వ్యాపారాలు ఉత్సాహంగా సాగుతాయి. ఉద్యోగులు కొత్త హోదాలు అందుకుంటారు.
మకరం: ఆదాయం కంటే ఖర్చులు పెరుగుతాయి. ఆకస్మిక ప్రయాణాలు చేసే అవకాశం ఉంది. పనుల్లో జాప్యం జరుగుతుంది. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. వ్యాపారాలు, ఉద్యోగాలు మందకొడిగా సాగుతాయి.
కుంభం: ప్రయాణాలు వాయిదా వేస్తారు. పనుల్లో ఆటంకాలు కలిగే అవకాశం ఉంది. అనారోగ్యం. కుటుంబసభ్యులతో తగాదాలు రావచ్చు. వ్యాపారాలు, ఉద్యోగాలు సామాన్యంగా ఉంటాయి.
మీనం: నూతన పరిచయాలు. సంఘంలో గౌరవం లభిస్తుంది. వస్తులాభాలు. చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు. ఆస్తి వివాదాలు పరిష్కారమవుతాయి. వ్యాపారాలు, ఉద్యోగాలు ఆశాజనకంగా ఉంటాయి.
- సింహంభట్ల సుబ్బారావు