కౌలాలంపూర్‌లో వైఎస్సార్‌సీపీ విజయోత్సవం

Ysrcp victory celebrations held in Kuala Lumpur - Sakshi

కౌలాలంపూర్‌ : 2019 అసెంబ్లీ ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ 151 స్థానాలతో విజయదుందుబి మోగించడంతో ప్రపంచ వ్యాప్తంగా ఆ పార్టీ అభిమానులు సంబరాలు చేసుకుంటున్నారు. వైఎస్ జగన్‌ అభిమానులుగా ఈ విజయం ఎంతో సంతోషాన్ని ఇచ్చిందని వైఎస్సార్‌సీపీ ఎన్‌ఆర్‌ఐ వింగ్‌ మలేషియా సభ్యులు తెలిపారు. కౌలాలంపూర్‌లోని సెరిండా జలపాతం దగ్గర వైఎస్సార్‌సీపీ విజయాన్ని వేడుకగా జరుపుకున్నారు.

గుంటూరుకు చెందిన శ్యాం అనిల్ కుమార్, పెదకూరపాడుకు చెందిన వెంకటరెడ్డి, రాంబాబుల ఆధ్వర్యములో ఈ కార్యక్రమం జరిగింది. కట్టెపోగు కిషోర్, రోహిత్ క్రుపాల్, సంజీవ్ దాసి, చంద్రపాల్ బాబు పుల్లగూర, నెల్సన్, హరీష్, ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. వీరందరూ కుటుంబాలతో కలిసి రోహిత్ ప్రార్ధన చేయగా శ్యాం అనిల్ కుమార్, చంద్రపాల్ బాబు కేక్ కట్ చేసి వేడుకలు నిర్వహించారు. అనంతరం అనిల్ కుమార్, రోహిత్, రంబాబు, రాజేష్, రవికాంత్ తదితరులు మాట్లాడుతూ వైఎస్‌ జగన్ దేవుని దీవెనలతో ప్రజారంజకమైన పరిపాలన అందించాలని, అభివృద్ధి సంక్షేమం రెండు కళ్లుగా అద్భుతమైన పరిపాలన అందిచాలని కోరారు. ఇంత గొప్ప విజయాన్ని అందించిన ఆంధ్రప్రదేశ్‌ ప్రజలకు, వైఎస్సార్‌సీపీ నాయకులకు, విజయ సారధి వైఎస్‌ జగన్‌కిశుభాకాంక్షలు తెలిపారు.   

Read latest NRI News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top