దుబాయిలో గాయపడిన ఎల్లాపూర్‌ వాసి | Yellapur Village Person Injured in Dubai | Sakshi
Sakshi News home page

దుబాయిలో గాయపడిన ఎల్లాపూర్‌ వాసి

Apr 26 2019 8:25 AM | Updated on Apr 26 2019 8:25 AM

Yellapur Village Person Injured in Dubai - Sakshi

విమానాశ్రయంలో బాధితుడు లక్ష్మణ్‌తో మాట్లాడుతున్న బసంత్‌రెడ్డి

శంషాబాద్‌: బతుకుదెరువు కోసం దుబాయికి వెళ్లి అక్కడ రోడ్డు ప్రమాదంలో గాయపడిన నిర్మల్‌ జిల్లా ఖానాపూర్‌ మండలం పాత ఎల్లాపూర్‌ గ్రామానికి చెందిన మోకాసి లక్ష్మణ్‌ గురువారం హైదరాబాద్‌కు చేరుకున్నాడు. షార్జా ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆపన్న హస్తం కోసం ఎదురుచూసిన లక్ష్మణ్‌కు గల్ఫ్‌ వెల్ఫేర్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు బసంత్‌రెడ్డి సహాయపడ్డారు. ట్రస్టులు, ఎంబసీ, తెలంగాణ ప్రభుత్వం చొరవతో అక్కడి నుంచి లక్ష్మణ్‌ను తీసుకొచ్చారు. రోడ్డు ప్రమాదంలో రెండు కాళ్లకు తీవ్ర గాయాలయ్యాయి. లక్ష్మణ్‌ను ఎయిర్‌పోర్టులో ఆయన కుటుంబ సభ్యులు కలిసి కంటతడి పెట్టారు. తమ కుటుంబాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఆదుకోవాలని కోరారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement