అట్లాంటాలో వీనుల విందుగా 'తామా' సంక్రాంతి సంబరాలు

TAMA conducts Sankranthi Sambaralu in Atlanta - Sakshi

అట్లాంటా : అట్లాంటా తెలుగు సంఘం (తామా) ఆధ్వర్యంలో సంక్రాంతి సంబరాలు వీనుల విందుగా జరిగాయి. స్థానిక నార్‌క్రాస్ ఉన్నత పాఠశాలలో నిర్వహించిన ఈ సంబరాలను శూరా ఈబి 5 ఫండ్, మై టాక్స్ ఫైలర్, సంక్రాంతి రెస్టారెంట్ వారు సమర్పించగా, సుమారు 1200 మందికి పైగా హాజరయ్యారు.

ముందుగా పిల్లలకు ప్రత్యేకంగా నిర్వహించిన గ్లోబల్ ఆర్ట్ కళ, ది యంగ్ లీడర్స్ అకాడమీ ఉపన్యాసం పోటీలలో సుమారు 250 మంది పిల్లలు పాల్గొని తమ ప్రావీణ్యాన్ని ప్రదర్శించారు. ముగ్గుల పోటీలు, మెహిందీలో మహిళలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. అనంతరం సాంస్కృతిక కార్యదర్శి సుబ్బారావు మద్దాళి స్వాగతోపన్యాసం చేయగా, తామా కార్యవర్గం, బోర్డు సభ్యులు జ్యోతి ప్రజ్వలనతో సాంస్కృతిక కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి. ఇందులో భాగంగా ప్రదర్శించిన జానపద గీతాలు, శాస్త్రీయ సంగీతం, సినీ పాటలు, నృత్యాలు, శ్లోకాలు అందరిని ఆకట్టుకున్నాయి. సాంస్కృతిక కార్యక్రమాలలో పాల్గొన్న అందరికీ ప్రశంసా పత్రాలు అందజేశారు.

అధ్యక్షులు వెంకీ గద్దె ప్రసంగిస్తూ తామా నిర్వహించే ఉచిత క్లినిక్, స్కాలర్‌షిప్స్‌, మనబడి, స్పోర్ట్స్, సాహిత్యం, తదితర విద్య, వైద్యం, వినోద కార్యక్రమాలను వివరించారు. తామా కార్యవర్గం, చైర్మన్ వినయ్ మద్దినేని సారథ్యంలో బోర్డు సభ్యుల చేతులమీదుగా స్పాన్సర్స్ శ్రీనివాస్ నిమ్మగడ్డ, హరిప్రసాద్ సాలియాన్, జాన్స్ క్రీక్ డిస్ట్రిక్ట్ 50 హౌస్ ప్రతినిధి ఏంజెలికా కౌషె, హిందూ టెంపుల్ ప్రెసిడెంట్ షీలా లింగం, అట్లాంటా ఐటీ సర్వ్ ప్రెసిడెంట్ క్రిస్ గద్దె, స్కాలర్షిప్స్ సమన్వయకర్త సీత వల్లూరుపల్లి, మనబడి సమన్వయకర్త విజయ్ రావిళ్ల, ఉపాధ్యాయని ఉపాధ్యాయులను సగౌరవంగా సత్కరించారు. మధ్య మధ్యలో గోదావరి రెస్టారెంట్, విజయ కలెక్షన్స్, నేటివ్ ట్రెండ్స్, ఏబీసీ పార్టీ హాల్, కేబీ జవేరీ వారు సమర్పించిన గ్రాండ్ రాఫుల్ విజేతలకు బహుమతులు అందజేశారు.

గాయని శిల్ప, గాయకులు ప్రసాద్ సింహాద్రి తమ పాటలతో ప్రేక్షకులను మైమరపించారు. వారి పాటలకు పిల్లలు, యువతీయువకులు వేదిక మీదకు వెళ్లి మరీ డ్యాన్స్ చేయడం విశేషం. గాయని శిల్ప నిర్వహించిన సంప్రదాయ దుస్తుల పోటీలలో మహిళలు, పిల్లలు పాల్గొనగా విజేతలకు బహుమతులు అందజేశారు. నగరంలోని ప్రముఖ వ్యాపారస్తులు ఏర్పాటు చేసిన స్టాల్స్‌లో ప్రత్యేక ఆహార పదార్థాలు, ఆభరణాలు, వస్త్రాలు విశేషంగా ఆకట్టుకున్నాయి. పిల్లలు ఎక్కువగా ఫేస్ పెయింటింగ్ స్టాల్ దగ్గర తిరుగుతూ కనిపించారు.

ఈ కార్యక్రమం విజయవంతం కావడానికి సహకరించిన వాలంటీర్స్ శ్రీనివాస్ లావు, అంజయ్య చౌదరి లావు, అనిల్ యలమంచిలి, ఉపేంద్ర నర్రా, వెంకట్ అడుసుమిల్లి, విజయ్ రావిళ్ల, శ్రీని బలుసు, వెంకట్ గోగినేని, విజయ్ కొత్తపల్లి, మురళి బొడ్డు, విజయ్ బాబు కొత్త, యశ్వంత్ జొన్నలగడ్డ, రమణ, చైతన్య, అరుణ మద్దాళి, సునీత పొట్నూరు, అబ్దు, రీమ, సాన్వి, అక్షు, వేదికను అందంగా అలంకరించిన మేరీగోల్డ్ ఈవెంట్స్ సుజాత పొన్నాడ, ఆడియో లైటింగ్ ఫోటోగ్రఫీ అందించిన బైట్ గ్రాఫ్ ప్రశాంత్ కొల్లిపర, రుచికరమైన భోజనాలందించిన సంక్రాంతి రెస్టారెంట్ శ్రీనివాస్ నిమ్మగడ్డ, సమర్పకులు శూరా ఈబి 5 ఫండ్ ప్రసాద్ గద్దె, మై టాక్స్ ఫైలర్ హరిప్రసాద్ సాలియాన్, నార్‌క్రాస్ ఉన్నత పాఠశాల యాజమాన్యం, వ్యాఖ్యాత శ్రీధర్, ది యంగ్ లీడర్స్ అకాడమీ కమల వడ్లమూడి, గ్లోబల్ ఆర్ట్ సుధ గోపాలకృష్ణన్, తామా కార్యవర్గానికి  బోర్డు సభ్యులకు వెంకీ గద్దె ధన్యవాదాలు తెలిపారు.

Read latest NRI News and Telugu News | Follow us on FaceBook, Twitter


Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top