సింగపూర్‌లో హైదరాబాద్‌ వ్యాపారి దారుణ హత్య | Hyderabad business man murdered in Singapore | Sakshi
Sakshi News home page

సింగపూర్‌లో హైదరాబాద్‌ వ్యాపారి దారుణ హత్య

Nov 10 2017 11:52 AM | Updated on Nov 10 2017 12:33 PM

Hyderabad business man murdered in Singapore - Sakshi

హైదరాబాద్‌: సింగపూర్‌లో నగర వ్యాపారి వాసుదేవ్ రాజ్ దారుణ హత్యకు గురయ్యారు. వ్యాపారం పేరుతో కుషాయిగూడ మహేష్‌నగర్‌ వాసి అయిన వాసుదేవ్‌ను నిందితులు సింగపూర్ తీసుకెళ్లారు. అక్కడ ఓ గదిలో బంధించి అతని బంధువులకు ఫోన్ చేసి రూ.3 కోట్లు డిమాండ్ చేశారు. వాసుదేవ్‌ను బంధించిన ఫొటోలను వారికి వాట్సప్‌లో పంపారు. అయితే వారు సకాలంలో స్పందించలేదనే కోపంతో వాసుదేవ్‌ను హతమార్చారు.

భారత రాయబార కార్యాలయ అధికారుల ద్వారా కుటుంబీకులకు వాసుదేవ్ హత్యకు సంబందించిన సమాచారం అందింది. శనివారం లేదా ఆదివారం అతని మృతదేహం నగరానికి చేరుకోనుంది.

Advertisement
 
Advertisement
Advertisement