అమిత్ షాతో యువరాజ్ సింగ్ భేటి! | Yuvraj Singh Met BJP President Amit Shah | Sakshi
Sakshi News home page

అమిత్ షాతో యువరాజ్ సింగ్ భేటి!

Sep 12 2014 7:57 PM | Updated on Mar 29 2019 9:24 PM

అమిత్ షాతో యువరాజ్ సింగ్ భేటి! - Sakshi

అమిత్ షాతో యువరాజ్ సింగ్ భేటి!

బీజేపీ చీఫ్ అమిత్ షాను పార్టీ ప్రధాన కార్యాలయంలో డాషింగ్ క్రికెటర్ యువరాజ్ సింగ్ శుక్రవారం కలిశారు

న్యూఢిల్లీ: బీజేపీ చీఫ్ అమిత్ షాను పార్టీ ప్రధాన కార్యాలయంలో డాషింగ్ క్రికెటర్ యువరాజ్ సింగ్ శుక్రవారం కలిశారు. అమిత్ షాను యువరాజ్ సింగ్ కలువడం అటు రాజకీయాల్లోనూ, క్రీడారంగంలోనూ చర్చకు దారి తీసింది. హర్యానా అసెంబ్లీ ఎన్నికలకు ఎన్నికల కమిషన్ తేదిలు ఖరారు చేసిన తర్వాత అమిత్ షాను యువరాజ్ కలువడం ప్రాధాన్యత సంతరించుకుంది. 
 
అక్టోబర్ 15 తేదిన జరగనున్న ఎన్నికల కోసం యువరాజ్ ప్రచారం చేసే అవకాశం ఉందని జాతీయ మీడియాలో కథనాలు వెలువడ్డాయి. అయితే బీజేపీలో యువరాజ్ చేరడమే కాకండా హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం ఉందని ఊహాగానాలు వస్తున్నాయి. 90 అసెంబ్లీ సీట్లకు ఇప్పటికే 43 మందితో కూడిన తొలి జాబితాను విడుదల చేసింది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement